Balapur Ganesh Laddu Auction Live: బాలాపూర్ గణేష్‌ లడ్డూకి రికార్డు ధర.. ఎవరు దక్కించుకున్నారంటే..

Updated on: Sep 25, 2026 | 12:43 PM

బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాటపై అందరి చూపు నెలకొంది. ఉదయం 11:00 గంటలకు వేలం ప్రారంభమైంది. అనంతరం 18 కిలోమీటర్ల శోభాయాత్రగా బాలాపూర్ గణేష్‌ను హుస్సేన్‌సాగర్‌కు తరలించనున్నారు. గత రికార్డులను అధిగమిస్తుందా.. ఈసారి ఎన్ని లక్షలు పలుకుతుంది.. అనేది ఆసక్తి నెలకొంది.

అందరిచూపు బాలాపూర్ గణేష్‌ లడ్డూ వేలం పాటపైనే నెలకొంది.. వేలంపాట ప్రారంభమైంది. బాలాపూర్ గణేష్ చివరి పూజా కార్యక్రమం అనంతరం క్రేన్ సహాయంతో బాలాపూర్ గణేషుడ్ని మినీ ట్రక్కుపైకి ఎక్కించి… ఉదయం 7గంటలకు గ్రామ ప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం 9:00 గంటలకు ప్రదక్షిణ పూర్తి చేసుకుని.. బాలాపూర్ గ్రామ బొడ్రాయి దగ్గరకు గణేష్‌ విగ్రహాన్ని తీసుకువచ్చారు.. ఉదయం 11:00 గంటలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట కార్యక్రమం ప్రారంభమైంది. లడ్డూ వేలం తర్వాత హుస్సేన్‌ సాగర్‌కు బాలాపూర్‌ గణేష్ ను తరలించారు..

బాలాపూర్‌ లడ్డూకి రికార్డు ధర

రూ.39లక్షలకు బాలాపూర్‌ లడ్డూని సామ ప్రణీత్‌రెడ్డి దక్కించుకున్నారు. గతేడాది కన్నా రూ.4లక్షలు ఎక్కువకు వేలంపాట పాడారు. గతేడాది 35లక్షలకు బాలాపూర్ లడ్డూ ధర పలికింది.

18 కిలోమీటర్లపాటు బాలాపూర్ గణేష్‌ శోభాయత్ర కొనసాగనుంది.. ఖైరతాబాద్ గణేశుడి తర్వాత భాగ్యనగరంలో అందరి దృష్టినీ ఆకర్షించేది బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట. ఇక్కడి లంబోదరుడి చేతిలో ఉండే లడ్డూ వేలం పాటతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంటోంది. లడ్డూను ఎవరు దక్కించుకుంటే వారింట సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే గణేశుడి లడ్డూ వేలం పాట కోసం సర్వత్రా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

Published on: Sep 25, 2026 06:49 AM
Loading...
Unable to load recommendations.
Follow Us