ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. తక్కువ ధరకే నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ!
ఆంధ్రప్రదేశ్‌లో సామాన్యులకు తక్కువ ధరకే నాణ్యమైన సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 151 రైతుబజార్లలో బీపీటీ బియ్యం కిలో రూ.49కు, నెల్లూరు కేఎన్ఎం రకం బియ్యం రూ.50కు అందుబాటులో ఉంచుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మొత్తం 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. త్వరలో కందిపప్పు, పామాయిల్‌ను కూడా తక్కువ ధరలకు అందించే యోచనలో ప్రభుత్వం ఉంది.
సామాన్యులపై నిత్యావసర సరుకుల ధరల భారాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. విజయవాడలోని భవానీపురం రైతుబజార్లో తక్కువ ధరకే నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఘనంగా ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 151 రైతుబజార్లలో సన్నబియ్యాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. ఇందులో భాగంగా BPT రకం బియ్యం కేజీ కేవలం రూ. 49 చొప్పున 26 కేజీల బ్యాగ్‌లో అందిస్తున్నారు. ఇక మార్కెట్లో రూ. 85 వరకు ధర పలుకుతున్న నాణ్యమైన నెల్లూరు KNM వెరైటీ బియ్యాన్ని ప్రభుత్వం కేవలం రూ. 50 కే అందిస్తోంది. ప్రజలందరికీ ఈ రాయితీ బియ్యం సులభంగా దక్కేలా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందుబాటులో ఉంచినట్లు మంత్రి తెలిపారు. పండుగ సీజన్లో ధరలు విపరీతంగా పెరిగి ప్రజలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ముందుచూపుతో ఈ చర్యలు తీసుకుంటోంది. కేవలం బియ్యం మాత్రమే కాకుండా, రాబోయే రోజుల్లో కందిపప్పు, పామాయిల్ వంటి ఇతర నిత్యావసర సరుకులను కూడా తక్కువ ధరలకే సరఫరా చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ప్రభుత్వ ఈ నిర్ణయం పట్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై ప్రభుత్వం నిర్ణయం!
PF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఉమాంగ్ యాప్‌లోనే యూఏఎన్, విత్‌డ్రా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..
ఉపాధ్యాయుడి వింత చేష్టలు.. విద్యార్ధి తలపై ఏం చేశాడో చూడండి!
హైదరాబాద్ నుంచి 3 బుల్లెట్ ట్రైన్లు! మూడు నగరాలకు హైస్పీడ్ జర్నీ!
