ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. ఒకేసారి ఖాతాల్లోకి రూ.6,000 జమ!
ఆంధ్రప్రదేశ్ రైతులకు అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలపై ఆసక్తి నెలకొంది. దీపావళికి ముందే అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.6,000 జమ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.4,000, కేంద్రం పీఎం కిసాన్ కింద రూ.2,000 అందిస్తాయి. అయితే నిధుల విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నగదు అందేందుకు రైతులు ఈ-కేవైసీ, ఆధార్ అనుసంధానం, ఎన్పీసీఐ మ్యాపింగ్, భూమి రికార్డులను తనిఖీ చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ లోని అన్నదాతలకు శుభవార్త. అన్నదాత సుఖీభవ నిధుల విడుదలపై క్లారిటీ వచ్చింది. త్వరలోనే ఈ నిధులు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. దీంతో ఒకేసారి రైతుల అకౌంట్లలో రూ.6 వేలు జమ కానున్నాయి. దసరా కానుకగా ఈ నిధులు విడుదల చేస్తారని భావించినా.. జాప్యం కారణంగా ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. అయితే దీపావళికి ముందు ఈ సొమ్ము విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి, రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని అమలు చేస్తోంది. వరుస పండుగల వేళ రైతుల కుటుంబాల్లో ఆనందం నింపేలా దీపావళికి ముందే ఈ ఆర్థిక సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. అన్నదాత సుఖీభవ పథకం ప్రత్యేకత ఏమిటంటే, దీనిని కేంద్ర ప్రభుత్వపు ప్రతిష్టాత్మక పథకమైన ‘పీఎం కిసాన్’ తో అనుసంధానించి అమలు చేస్తున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ. 4,000 జమ చేస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కిసాన్’ పథకం కింద రూ. 2,000 జమ చేస్తుంది. ఈ విధంగా రెండు పథకాలు కలిపి అర్హులైన రైతుల ఖాతాల్లో ఒకేసారి రూ. 6,000 జమ అవుతాయి. గతంలో దసరా కానుకగా ఈ నిధులు విడుదలవుతాయని రైతులు ఆశించినప్పటికీ, కొన్ని పరిపాలనాపరమైన కారణాల వల్ల జాప్యం జరిగింది. అయితే, అక్టోబర్ 20 నాటికి మునుపటి విడత జరిగి నాలుగు నెలలు పూర్తి కావస్తుండటం, దీపావళి పండుగ సమీపిస్తుండటంతో ఏ క్షణమైనా నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు మరియు కూలీల ఖర్చుల కోసం రైతులు అప్పులపాలుకాకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అన్నదాతలకు ఈ ఆర్థిక భరోసానిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద ఏడాదికి రూ. 6,000 అందిస్తుండగా.. ఏపీ ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ కింద మరో రూ. 14,000 జతచేస్తోంది. మొత్తంగా ఏడాదికి ప్రతి రైతు కుటుంబానికి రూ. 20,000 పెట్టుబడి సాయంగా అందుతుంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. గతంలో జూన్ 20వ తేదీన మునుపటి విడత నిధులు విడుదల కాగా, ఇప్పుడు తర్వాతి విడత నగదు విడుదలకు సమయం వచ్చింది. ఎల్-నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం అందించే ఈ పెట్టుబడి సాయం ఎలాంటి అంతరాయం లేకుండా నేరుగా మీ బ్యాంకు ఖాతాలో పడాలంటే రైతులు కొన్ని కీలకమైన సాంకేతిక ప్రక్రియలను వెంటనే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అవేంటంటే.. ప్రతి రైతు విధిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. దీనిని మీ సేవా కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు లేదా కామన్ సర్వీసెస్ సెంటర్ల ద్వారా చేసుకోవచ్చు. రైతుల బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు కచ్చితంగా అనుసంధానమై ఉండాలి. అలాగే బ్యాంకు ఖాతాకు ఎన్పీసీఐ మ్యాపింగ్ పూర్తయితేనే ప్రభుత్వ నగదు జమ అవుతుంది. లేదంటే నిధులు నిలిచిపోయే ప్రమాం ఉంది. ల్యాండ్ రికార్డులకు సంబంధించిన వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఈ నిబంధనలన్నీ సక్రమంగా ఉన్న రైతులందరికీ దీపావళి కానుకగా నగదు నేరుగా వారి ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సాయం ప్రస్తుత వేసవి, యాసంగి సాగు పనులకు రైతులకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టీటీడీ కీలక నిర్ణయం! తిరుమలలో ఏఐ టెక్నాలజీతో ఉద్యానవనాల అభివృద్ధి
వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. కంటిలో పెరిగిన పన్ను!
డ్రైవర్ లేకుండానే రివర్స్‌లో దూసుకెళ్లిన కారు..