బలపడుతున్న అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన!
బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రలో వర్షాల ప్రభావం అధికంగా ఉండనుంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉంది.
బంగాళాఖాతంలో వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 23న సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుండగా, ఇది క్రమక్రమంగా బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా అక్టోబర్ 27 నుంచి ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ, విశాఖపట్నం జిల్లాలపై ఈ వాతావరణ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వర్షాల ప్రభావంతో జనజీవనం స్తంభించే అవకాశం ఉంది. తెలంగాణలోని దక్షిణ జిల్లాలతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం :
ప్రమోషన్స్‌లో దూసుకుపోతున్న ‘రామాయణ’ టీమ్
సౌత్ డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హృతిక్ రోషన్