భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల వారికి బిగ్ అలర్ట్

Updated on: Nov 24, 2026 | 4:42 PM

బంగాళాఖాతంలో విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురువనున్నాయి. మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో మోస్తరు వర్షాలు అంచనా. అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురవగా, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయి. నెల్లూరులో ఇప్పటికే ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. నైరుతి నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ఈ ద్రోణి వల్ల రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.ముఖ్యంగా మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో సైతం అక్కడక్కడ వర్ష సూచన కనిపిస్తోంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో నిన్నటి రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. నెల్లూరుతో పాటు పలు పరిసర ప్రాంతాల్లో వర్షం కారణంగా తడిసి ముద్దైన పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us