మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సొంత మేనమామే తన మేనల్లుడిని పొట్టనబెట్టుకున్నాడు. దండేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన అనిల్ తన మేనమామ కూతురుని ప్రేమించాడు. అయితే అది నచ్చక.. తన కూతుర్ని ప్రేమిస్తున్న మేనల్లుడిపై కక్ష పెంచుకున్నాడు మేనమామ..ఎలాగైన మట్టుబెట్టాలని పథకం వేశాడు. తనతో మాట్లాడే పనుందని చెప్పి అనిల్ని ఒకచోటకు తీసుకెళ్లాడు మేనమామ. తను ముందుగానే బీరులో పురుగుల మందు కలిపి సిద్దంగా ఉంచుకున్నాడు. అల్లుడిని కత్తితో బెదిరించి బీర్ తాగించాడు.అనిల్ అపస్మారక స్థితిలోకి వెల్లగానే మేనమామ అక్కడి నుంచి జారుకున్నాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న యువకుడిని స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అనిల్ చనిపోయాడు. కానీ, చనిపోవడానికి ముందు.. తాను అనుభవించిన నరకాన్ని సెల్పీ వీడియోలో రికార్డు చేశాడు అనిల్. తన మామ తనని ఎలా కత్తి పట్టుకుని బెదిరించాడో, ఎలా పురుగు మందు బీరులో కలిపి తాగించాడో వివరించాడు. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు మేనమామపై కేసు నమోదు చేశారు పోలీసులు.. వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని వీడియోస్ కోసం: Videos Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్.. Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో.. Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..