అమ్మో.. మళ్లీ కరోనా !! దేశానికి మరోసారి కొవిడ్ ముప్పు
అమెరికాలో BA.3.2 'సికాడా' అనే కొత్త ఒమిక్రాన్ సబ్-వేరియంట్ కారణంగా కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 25 రాష్ట్రాల్లో ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. గొంతు నొప్పి, అలసట, జలుబు, కొన్నిసార్లు రుచి/వాసన కోల్పోవడం దీని ప్రధాన లక్షణాలు. ఇది వేగంగా వ్యాపించినా, తీవ్రత మధ్యస్థంగానే ఉంది. వృద్ధులు, గర్భిణీలు అప్రమత్తంగా ఉండాలి. మాస్కులు ధరించడం, పరిశుభ్రత పాటించడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
అమెరికాలో మళ్లీ కోవిడ్- 19 కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. దాదాపు 25 రాష్ట్రాల్లో వ్యాధి సోకిన వారికి కోవిడ్-19కి సంబంధించిన లక్షణాలు కనిపించాయి. దీంతో అమెరికాలో హాస్పిటల్ వైపు పరుగులు తీస్తున్నారు. గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న వాతావరణం, ఈ కొత్త కేసుల రాకతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముఖ్యంగా BS.3.2 అనే కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తుండటం, ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో సుమారు 130 మందికి పైగా ఈ కొత్త వేరియంట్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆందోళన మరింత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి రూపాంతరం చెందుతూ కొత్త రూపంలో విరుచుకుపడుతోంది. BA.3.2 కొత్త ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ‘సికాడా’ వెలుగులోకి వచ్చింది. ఇది ఇప్పటికే 23కి పైగా దేశాలకు పాకినట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ధృవీకరించాయి. ఈ వేరియంట్‌ను మొదటగా 2024 నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో గుర్తించారు. అయితే, 2025 సెప్టెంబర్ నుంచి దీని వ్యాప్తి వేగవంతమైంది. ప్రస్తుతం అమెరికాలోని 25 రాష్ట్రాల్లోని మురుగునీటి నమూనాల్లో ఈ వైరస్ ఆనవాళ్లు కనిపించడంతో ఆరోగ్య శాఖ అధికారులు అలర్టయ్యారు. గత వేరియంట్లతో పోలిస్తే ‘సికాడా’ వేరియంట్ లక్షణాలు భిన్నంగా ఉన్నాయి. ఈ వేరియంట్ సోకిన వారిలో గొంతు మంట, నొప్పి ప్రధానంగా కనిపిస్తోంది. ముక్కు బ్లాక్ అవ్వడం లేదా నీరు కారడం ఉంటుంది. విపరీతమైన నీరసం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, చలి జ్వరం, పొడి దగ్గు ఉంటుందని వైద్యులు తెలిపారు. కొన్ని కేసుల్లో ఈ వేరియెంట్ సోకిన వారికి రుచి, వాసన కోల్పోయే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి ఈ వేరియంట్‌ను ‘వేరియంట్ అండర్ మానిటరింగ్’ కేటగిరీలో పెట్టారు. అంటే దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది వేగంగా వ్యాప్తి చెందే గుణం కలిగి ఉన్నప్పటికీ, దీని వల్ల వచ్చే అనారోగ్యం స్వల్పంగా లేదా మధ్యస్థంగానే ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. అయితే, వృద్ధులు, గర్భిణీలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ‘సికాడా’ వేరియంట్ మునుపటి వేరియంట్ల కంటే భిన్నంగా ఉండటం వల్ల, ఇది టీకాలు తీసుకున్న వారిలో కూడా మళ్లీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని, కానీ అప్రమత్తత అవసరమని ప్రభుత్వం తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పట్టపగలే ఆకాశంలో చీకట్లు.. భయపెట్టిన కాకుల గుంపు.. వినాశనానికి సంకేతమా
ఇంటి బాధ్యత నాపైనే ఉంది.. నేను చదువుకోవాలి సార్
జాబిల్లి చెంతకు ‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములతో పాటు చిన్నారి ‘బొమ్మ’
ఫ్యాన్స్ అంటూ వచ్చి.. రాళ్లతో కొట్టి.. కొమురక్కపై దాడి
నెటిజన్ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్