ఆ చెట్టుతో వాయు కాలుష్యానికి చెక్‌.. ఏపీలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా అందుబాటులోకి!

Updated on: Nov 12, 2026 | 1:27 PM

నగరాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు గుంటూరులో సరికొత్త ప్రయోగం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా గాంధీ పార్క్‌లో ఆల్గే ట్రీని ఏర్పాటు చేశారు. 600 లీటర్ల నీటి ట్యాంక్‌లో పెంచే ఆల్గే కిరణజన్య సంయోగక్రియ ద్వారా కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్ విడుదల చేస్తుంది. 25 పెద్ద చెట్లకు సమానమైన ఆక్సిజన్‌ను అందిస్తుందని అధికారులు చెబుతున్నారు.

చలికాలం ప్రారంభమైందంటే చాలు నగరాల్లో వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చుతుంది. ఢిల్లీ లాంటి మహానగరాల్లో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాంక్రీట్ జంగిల్స్‌గా మారిన నగరాల్లో చెట్లను నాటడానికి తగినంత స్థలం లేకపోవడంతో, వాయు కాలుష్య నివారణకు సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా గుంటూరు నగరంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ‘ఆల్గే ట్రీ’ ని ఏర్పాటు చేశారు. ఈ ఆల్గే ట్రీ ప్రత్యేకత ఏంటంటే.. సాధారణంగా 25 పెద్ద చెట్లు ఎంత పరిమాణంలో ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయో, ఒక్క ఆల్గే ట్రీ అంత ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. గుంటూరు నగరంలోని ప్రముఖ గాంధీ పార్క్‌లో ఈ చెట్టును ఏర్పాటు చేశారు. ఈ ఆల్గే ట్రీ నిర్మాణంలో 600 లీటర్ల సామర్థ్యం ఉన్న ఒక నీటి ట్యాంక్ ఉంటుంది. ఆ నీటిలో ఆల్గే ఉంచుతారు. ట్యాంక్ పైభాగంలో విసనకర్రల మాదిరిగా పనిచేసే ఫ్యాన్లు, వాటి పైన సోలార్ ప్యానెల్స్‌ను అమర్చారు. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్‌తో ఫ్యాన్లు నిరంతరం తిరుగుతుంటాయి. ఈ ఫ్యాన్లు చుట్టుపక్కల వాతావరణంలో ఉన్న కాలుష్య గాలిని, కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించి ఆల్గే ట్యాంక్‌లోకి పంపుతాయి. ట్యాంక్‌లోని ఆల్గే ‘కిరణజన్య సంయోగ క్రియ’ ప్రక్రియ ద్వారా ఆ కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకుని, స్వచ్ఛమైన ఆక్సిజన్‌గా మార్చి బయటకు విడుదల చేస్తుంది. పరిమిత స్థలంలో అత్యధిక స్థాయిలో వాయు శుద్ధిని అందించే ఈ ఆల్గే ట్రీ విధానం పర్యావరణ పరిరక్షణకు, నగరవాసులకు స్వచ్ఛమైన గాలిని అందించడానికి ఎంతగానో ఉపయోగపడనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాంబ్‌లా పేలిన ఫ్రిడ్జ్‌.. ఇల్లు దగ్ధం!

వామ్మో.. ఎంత పెద్ద చేపో.. జాలరి పంట పండిందిగా!

వాగు ఒడ్డున విచిత్రమైన రాయి.. దగ్గరకు వెళ్లి చూడగా హడల్‌!

ఒక్క రూపాయి కోసం కోర్టుకెక్కిన ప్రయాణికుడు! IRCTCకి వినియోగదారుల కమిషన్ షాక్!

రజనీ ‘ధర్మన్’లో రామ్ పోతినేని పవర్ ప్యాక్డ్ ఎంట్రీ.. బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర గ్యారంటీ!

Loading...
Unable to load recommendations.
Follow Us