Air India: విమాన ప్రయాణికులకు షాక్‌.. 1,200 విమానాలు రద్దు

Updated on: May 15, 2026 | 12:30 PM

పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం భారత విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. ఇరాన్-అమెరికా పరిస్థితుల కారణంగా ఎయిర్ స్పేస్ ఆంక్షలు, పెరిగిన జెట్ ఫ్యూయల్ ధరలతో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నుంచి ఆగస్టు వరకు మొత్తం 1,200 అంతర్జాతీయ విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ-న్యూయార్క్, ముంబై-JFK, చెన్నై-సింగపూర్ వంటి పలు రూట్లలో సేవలు నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం భారత విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల కారణంగా ఎయిర్ స్పేస్ ఆంక్షలు విధించడంతో విమానాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీనికి తోడు జెట్ ఫ్యూయల్ ధరలు, నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడంతో దిగ్గజ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నుంచి ఆగస్టు వరకు మూడు నెలల పాటు నెలకు సుమారు 400 చొప్పున మొత్తం 1,200 అంతర్జాతీయ విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా దేశాలకు వెళ్లే పలు సర్వీసులను కుదించడంతో పాటు కొన్ని రూట్లను పూర్తిగా సస్పెండ్ చేసింది. ముఖ్యంగా ఢిల్లీ-చికాగో, ఢిల్లీ-న్యూయార్క్, ముంబై-JFK, ఢిల్లీ-షాంఘై, చెన్నై-సింగపూర్ రూట్లలో విమానాలు పూర్తిగా రద్దు కానున్నాయి. అలాగే సాన్ ఫ్రాన్సిస్కో, టొరంటో, ప్యారిస్, సింగపూర్, మెల్బోర్న్, సిడ్నీ సర్వీసులను భారీగా తగ్గించారు. ప్రస్తుతం నెలకు 1,200 పైగా అంతర్జాతీయ విమానాలు నడుపుతున్న ఎయిర్ ఇండియా.. తాజా పరిస్థితుల వల్ల తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ హఠాత్ నిర్ణయంతో విదేశాలకు వెళ్లే భారతీయులు, ఎన్‌ఆర్‌ఐలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అయితే, విమానాల రద్దుతో ఇబ్బంది పడే ప్రయాణికులకు పూర్తి రీఫండ్ లేదా ఉచితంగా ప్రత్యామ్నాయ విమానాలు, డేట్ మార్పు సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణికులు తమ బుకింగ్స్ వివరాలను వెబ్‌సైట్ లేదా యాప్‌లో తనిఖీ చేసుకోవాలని సూచించింది. పశ్చిమాసియాలో పరిస్థితులు మెరుగుపడితేనే తిరిగి విమాన సేవలను పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంట్లో బంగారం దాచుకున్న వారికి బంపర్ ఆఫర్.. 10 గ్రాములున్నా లాభమే

ఆర్థిక సంక్షోభం దిశగా ప్రపంచం.. ఉప్పు నుండి ఉక్కు వరకు రేట్లు డబుల్

Follow Us