ఎసిడిటీ ఉందా? ఈ పండ్లు తింటున్నారా.. అయితే జాగ్రత్త!
సాధారణంగా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ, గ్యాస్ట్రిక్ లేదా అసిడిటీ సమస్యలతో బాధపడేవారు కొన్ని రకాల పండ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని పండ్లలో ఉండే ఆమ్ల గుణాలు కడుపులో మంటను, యాసిడ్ రిఫ్లక్స్‌ను పెంచుతాయి. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడేవారు ఆ పండ్లకు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు నిపుణులు. ఆ పండ్లేంటో చూద్దాం.
నారింజ, నిమ్మ సిట్రస్ పండ్లు. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉన్నప్పటికీ, సిట్రిక్ యాసిడ్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెల్లో మంటను ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా ఎసిడిటీ ఉన్నవారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకోకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే పైనాపిల్లోనూ సిట్రిక్ యాసిడ్‌తో పాటు ‘బ్రోమెలైన్’ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది కడుపులో ఆమ్లాల ఉత్పత్తిని పెంచి అశాంతిని కలిగిస్తుంది. మరో సిట్రస్ పండ్లు ద్రాక్ష లో కూడా టార్టారిక్ సిట్రిక్ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పిత్తాన్ని పెంచి కడుపులో మంటకు దారితీస్తాయి. కనుక వీటిని మితంగా తీసుకోవాలంటున్నారు. ఇక ఆయుర్వేదం ప్రకారం పచ్చి మామిడికాయ తినడం వల్ల పిత్త దోషం పెరుగుతుంది. ఇందులోని మాలిక్, ఆక్సాలిక్ ఆమ్లాలు అసిడిటీని తీవ్రతరం చేస్తాయి. అలాగే జామకాయలు… వీటిలో ఉండే గట్టి విత్తనాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
మరిన్ని వీడియోల కోసం :
రామ్ చరణ్, ఉపాసన కవలల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!
బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!
బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!