పోలీసోల్ల యాప్ డౌన్లోడ్ పెట్టు.. డిస్కౌంట్ ఆఫర్ పట్టు

Updated on: Nov 16, 2023 | 9:34 AM

పెద్దపెద్ద షాపింగ్ మాల్సోల్లు.. దసరా ఆఫర్లు, దీపావళి ఆఫర్లు, ఉగాది, సంక్రాంతి, క్రిస్మస్, న్యూఇయర్ డిస్కౌంట్ ఆఫర్లు అనిట్ల పండుగ ఆఫర్లు వెట్టుడు కామన్.. అయితె ఏపీ రాష్టం అమలాపురంకాడ.. స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ సేల్స్ వెట్టిండుల్లా.. అక్కడి డిఎస్పీ.. ఫోన్ల వాళ్లు చెప్పిన యాప్ డౌన్లోడ్ చేస్కుంటె.. బట్టల షాపుల 15 శాతం తగ్గింపట.. సూడుర్రి ఏందో అది.. ఆ.. ఏపీ ఆడోల్లు.. ముఖ్యంగ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆడోల్లంత ఈ ముచ్చట మంచిగ సూడాలె..

పెద్దపెద్ద షాపింగ్ మాల్సోల్లు.. దసరా ఆఫర్లు, దీపావళి ఆఫర్లు, ఉగాది, సంక్రాంతి, క్రిస్మస్, న్యూఇయర్ డిస్కౌంట్ ఆఫర్లు అనిట్ల పండుగ ఆఫర్లు వెట్టుడు కామన్.. అయితె ఏపీ రాష్టం అమలాపురంకాడ.. స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ సేల్స్ వెట్టిండుల్లా.. అక్కడి డిఎస్పీ.. ఫోన్ల వాళ్లు చెప్పిన యాప్ డౌన్లోడ్ చేస్కుంటె.. బట్టల షాపుల 15 శాతం తగ్గింపట.. సూడుర్రి ఏందో అది.. ఆ.. ఏపీ ఆడోల్లు.. ముఖ్యంగ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆడోల్లంత ఈ ముచ్చట మంచిగ సూడాలె.. ఇగొ ఈ ఫ్లక్సీ మీద ఏం రాశేఉందో సూడుర్రి ఫస్టయితె.. పట్టణ పోలీస్ వారి దిశచట్టం అవగాహన కార్యక్రమం.. మా షాపింగ్ మాల్ నందు కొత్తగా దిశ యాపును ఇన్ స్టాల్ చేసుకున్న వారికి మా షాపులో 15 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వబడునూ… సూశిర్రా.. అంటె ఇది దిశా యాప్ కోసమే కోనసీమ పోలీసోల్లు వెట్టిచ్చిన స్పెషల్ ఆఫరన్నట్టు.. స్మాట్ ఫోన్ తేవాలె.. దిశా యాప్ ఇన్ స్టాల్ చేస్కోవాలె.. షాపింగ్ చేశిన బిల్లు మీద పదియేన్ శాతం డిస్కౌంట్ కొట్టెయ్యాలె.. ఆఫరంటె ఆఫరే.. యాప్ తోని ఆడోల్లకు సేఫ్టీ.. బట్టల్ కొన్నోల్లకు రాయితీ.. ఇగొ ఆడోల్లచ్చుడే ఆల్శం.. ఇట్రావమ్మా అని పేరంటాలకొచ్చే గెస్టులను విల్శి వెల్కం ట్రీటిచ్చినట్టు.. వాళ్ల శేతులన్న ఫోన్లు తీస్కోని దిశ యాప్ ఇన్ స్టాల్చేశి.. మీకెన్నడన్న ఆపతొస్తె ఇగొ ఈ ఎస్వోఎస్ బటన్ ప్రెస్ చేస్తె సాల్.. మీరెక్కడున్నా ఐదు నిమ్షాలల్ల పోలీసోల్లు ఉర్కొస్తరు అని పోలీస్ మేడం ఇవరంగ చెప్తుంది..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనుషుల మీద కోతుల రౌడీయిజం.. బయటకి రావడానికే భయపడుతున్న జనాలు

Vishakapatnam: విశాఖలో విశాఖలో డేంజర్ బెల్స్.. దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత

జమ్ముకాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి లోయలో పడిన బస్సు

Leo OTT: లీక్‌ దెబ్బకు దిగొచ్చిన టీం.. ముందుగానే ఓటీటీ స్ట్రీమింగ్…

Daily Horoscope: ఆ రాశివారిపై అష్టమ రాహు ప్రభావం అయినా ఆ ఒక్క శక్తితో రోజంతా శుభం

Loading...
Unable to load recommendations.
Follow Us