రామ మందిర నిర్మాణానికి ఎంతకాలం ? ఐదేళ్లా ? వీహెచ్ పీ అంచనా !

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక వీ హెచ్ పీ, బజరంగ్ దళ్ వంటి హిందూ సంఘాలు రామాలయ నిర్మాణం పై దృష్టి సారించేందుకు కసరత్తు మొదలుపెట్టాయి. అయితే ప్రాథమిక అంచనా ప్రకారం గుడి నిర్మాణం ఇప్పుడప్పుడే కాదు.. దాదాపు ఐదేళ్లు పట్టవచ్ఛునని అంటున్నారు. 250 మంది కార్మికులు, కూలీలు ఇందుకోసం నిరంతరం పని చేయవలసి ఉంటుందని అంటున్నారు. విశ్వహిందూ పరిషత్ డిజైన్ ప్రకారం. ఇందుకు చాలా కృషి చేయాల్సి ఉంటుంది. […]

రామ మందిర నిర్మాణానికి ఎంతకాలం ? ఐదేళ్లా ? వీహెచ్ పీ  అంచనా !
Follow us

|

Updated on: Nov 10, 2019 | 1:19 PM

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక వీ హెచ్ పీ, బజరంగ్ దళ్ వంటి హిందూ సంఘాలు రామాలయ నిర్మాణం పై దృష్టి సారించేందుకు కసరత్తు మొదలుపెట్టాయి. అయితే ప్రాథమిక అంచనా ప్రకారం గుడి నిర్మాణం ఇప్పుడప్పుడే కాదు.. దాదాపు ఐదేళ్లు పట్టవచ్ఛునని అంటున్నారు. 250 మంది కార్మికులు, కూలీలు ఇందుకోసం నిరంతరం పని చేయవలసి ఉంటుందని అంటున్నారు. విశ్వహిందూ పరిషత్ డిజైన్ ప్రకారం. ఇందుకు చాలా కృషి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీహెచ్ పీ కార్యశాల వద్ద నిపుణులెవరూ లేరని . టెంపుల్ వర్క్ షాప్ సూపర్ వైజర్ తెలిపారు. చివరి శిల్ప కళాకారుడు రజనీకాంత్ సోంపుర గత జులైలో మరణించారని ఆయన చెప్పారు. 1990 నుంచి ఈ కార్యశాల వద్ద రోజూ సుమారు ఎనిమిది గంటలు పనులు జరుగుతున్నాయి. కానీ ఈ దశాబ్ద కాలంలో గ్రౌండ్ ఫ్లోర్ కట్టడ నిర్మాణంలో సగభాగం మాత్రమే జరిగింది. పని పూర్తి స్థాయిలో మళ్ళీ మొదలుపెట్టాలంటే కనీసం 250 నుంచి 300 మంది పనివారు అవసరమవుతారని సూపర్ వైజర్ అన్నుభాయి సోంపుర చెబుతున్నారు. అసలు ఆలయ నిర్మాణానికి మొదట పునాది వేయాల్సి ఉంటుంది. రాళ్లు, సిమెంట్, ఇసుక తదితరాలను తరలించాల్సి ఉంటుంది.. వైట్ సిమెంటును మొత్తం కట్టడమంతా వేయాల్సి ఉంటుంది.. మొదట డిజైన్ ను ఖరారు చేయాల్సి ఉంటుంది కూడా అని ఆయన వివరించారు.

పిల్లర్లలో సగం రెడీ అయ్యాయని, మొత్తం 106 పిల్లర్లను, శిఖరాన్ని, రూఫ్ ను నిర్మించాల్సి ఉంటుందని అన్నుభాయి వెల్లడించారు. మొదట రామజన్మ భూమి న్యాస్ సభ్యులు సమావేశమై నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని వీ హెచ్ పీ చీఫ్ అవధ్ ప్రాంత శరద్ శర్మ పేర్కొన్నారు. 1984 లో ఆలయ నిర్మాణం కోసం శిలాన్యాస్ జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అక్కడి నుంచే పని ప్రారంభం కావచ్ఛునని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో హిందూ భక్తుల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. రామ, సీతా లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలను ప్రముఖ శిల్ప కళాకారులచేత చెక్కించవలసి ఉంటుందన్నారు. ఇది జరగడానికి చాలా కాలమే పట్టవచ్ఛునని, అయితే ఇందుకు కాల పరిమితి ఇప్పుడే చెప్పలేమని కూడా శర్మ పేర్కొన్నారు.