హాంకాంగ్ కి ఆర్థిక ప్రయోజనాల నిలిపివేత.. ట్రంప్

హాంకాంగ్ కి పలు ఆర్ధిక ప్రయోజనాలను రద్దు చేస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. పైగా తమ దేశ యూనివర్సిటీలలో చైనా విద్యార్థులు చేరేందుకు కూడా అనుమతించబోమని అన్నారు.

హాంకాంగ్ కి ఆర్థిక ప్రయోజనాల నిలిపివేత.. ట్రంప్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 30, 2020 | 11:12 AM

హాంకాంగ్ కి పలు ఆర్ధిక ప్రయోజనాలను రద్దు చేస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. పైగా తమ దేశ యూనివర్సిటీలలో చైనా విద్యార్థులు చేరేందుకు కూడా అనుమతించబోమని అన్నారు. హాంకాంగ్ పై చైనా తన జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించేందుకు జరుపుతున్న ప్రయత్నాల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్టంపై అమెరికాతో బాటు బ్రిటన్ కూడా ఐక్యరాజ్యసమితి భద్రతామండలి లో ఆందోళనను, అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అసలు మండలిలో చైనాకు స్థానం లేదని ఈ దేశాలు పేర్కొన్నాయి. కాగా… తాము ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా వైదొలగుతున్నామని ట్రంప్ ప్రకటించారు. కరోనా వైరస్ విషయంలో ఈ సంస్థ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన మళ్ళీ ఆరోపించారు. హాంకాంగ్ పట్ల డ్రాగన్ కంట్రీ అనుసరిస్తున్న విధానం ప్రపంచ ప్రజలందరికీ ఓ ట్రాజెడీ వంటిదని ఆయన అభివర్ణించారు. చైనా మిలిటరీతో సంబంధం ఉన్న యుఎస్ యూనివర్సిటీల్లో చైనా విద్యార్థులు చేరకుండా చూసేందుకు ఉద్దేశించిన ఉత్తర్వులను జారీ చేశారు. మా దేశ పారిశ్రామిక రహస్యాలను దొంగిలించేందుకు చైనా గూఢచర్య కార్యకలాపాలను నిర్వహిస్తోందని ట్రంప్ దుయ్యబట్టారు.