Breaking News
  • అమరావతి: చంద్రబాబును నమ్మి భూములిచ్చి దళిత రైతులు మోసపోయారు. మా ప్రభుత్వ నిర్ణయంతో దళిత రైతులకు న్యాయంజరిగింది-ఎమ్మెల్యే ఆర్కే. దళిత రైతుల భూములను చంద్రబాబు తనవారికి కారుచౌకగా ఇప్పించారు. రాజధాని ప్రాంతంలో బినామీలుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల చిట్టాను త్వరలో బయటపెడతాం-ఎమ్మెల్యే ఆర్కే.
  • ప్రకాశం జిల్లా: సింగరాయకొండ మండలం పాకల దగ్గర సముద్రంలో నలుగురు యువకుల గల్లంతు. ముగ్గురిని కాపాడిన మెరైన్‌ పోలీసులు. మరో యువకుడి కోసం కొనసాగుతున్న గాలింపు.
  • యానాంలో ప్రేమజంట అనుమానాస్పద మృతి. మృతులు కాట్రేనిపాడుకు చెందిన రమేష్‌. మలికిపురం మండలానికి చెందిన యువతిగా గుర్తింపు. పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని ఈ నెల 9న ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రేమజంట. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 14 కిలోల బంగారం స్వాధీనం. అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.5.46 కోట్లు ఉంటుందని అంచనా.
  • అమరావతి: అసెంబ్లీకి వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకున్నారు-చంద్రబాబు. అమాయకులపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ పెట్టి దాడులు చేస్తున్నారు. టీడీపీ హయాంలో ఇంగ్లీష్‌ మీడియాన్ని వైసీపీ నేతలు వ్యతిరేకించారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తెచ్చి రెండు నాలుకలధోరణి అవలంబిస్తున్నారు కొత్త చీఫ్‌ మార్షల్‌ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు-చంద్రబాబు.
  • గుంటూరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైసీపీ నెరవేర్చలేదు. ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు-యరపతినేని. ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయి-మాజీ ఎమ్మెల్యే యరపతినేని. నియోజకవర్గ పరిధిలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. వైసీపీ కార్యకర్తలే ఇసుకను బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముతున్నారు-మాజీ ఎమ్మెల్యే యరపతినేని.

మా దేశానికే మీ సేవలు… లేకుంటే.. ‘ యాపిల్ ‘ కి ట్రంప్ హెచ్చరిక

Trump, మా దేశానికే మీ సేవలు… లేకుంటే.. ‘ యాపిల్ ‘ కి ట్రంప్ హెచ్చరిక

యాపిల్ సంస్థ తన ఉత్పత్తులను తమ దేశంలోనే తయారు చేయాలని, లేని పక్షంలో విపరీతంగా టారిఫ్ లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. యాపిల్ తాజాగా తన అత్యాధునిక ‘ మ్యాక్ ప్రో ‘ డెస్క్ టాప్ కంప్యూటర్ ని తయారు చేసింది. కంపెనీ ఉత్పత్తుల్లోనే ఇది అత్యంత ఖరీదైనది. తన ప్రొడక్టులను ఇక అమెరికా నుంచి చైనాకు షిఫ్ట్ చేయాలని యాపిల్ నిర్ణయించిన నేపథ్యంలో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ మీరు చైనాకు ‘ వెళ్ళిపోతే ‘.. మీకు టారిఫ్ లో మాఫీ గానీ, ఇతర ప్రయోజనాలు గానీ ఉండబోవు ‘ అని ఆయన ట్వీట్ చేశాడు. యాపిల్ తన కొత్త కంప్యుటర్లోని కొన్ని విడిభాగాలను చైనాలో తయారు చేయించింది. కానీ ఇక ఈ ‘ ఆటలు సాగబోవని ‘, మీరు ఈ దేశంలోనే ఇందుకు పూనుకోవాలని ట్రంప్ ‘ ఆదేశించాడు ‘. ఆయన ఈ ప్రకటన చేసిన వెంటనే.. యాపిల్ షేర్ల వ్యాల్యూ ఇండెక్స్ లో స్వల్పంగా తగ్గింది. (ఈ ఇండెక్స్ లోనే ప్రధాన టెక్నాలజీ సంస్థల షేర్లు ట్రేడ్ అవుతుంటాయి).

అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ జరుగుతున్నప్పటికీ.. తన ఈ అధునాతన కంప్యూటర్ ఉత్పత్తిని చైనాకు మార్చాలని యాపిల్ భావిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. కొత్త మ్యాక్ ప్రో కంప్యూటర్ తయారీకి అనువుగా చైనాలోని ‘ క్వాంటా’ కంప్యూటర్ సంస్థతో కలిసి పని చేయాలని యాపిల్ నిర్ణయించిందని న్యూయార్క్ డైలీ ఒక వార్తను ప్రచురించింది. ఆ దేశంలోని ఓ ప్లాంట్ లో ఇప్పటికే యాపిల్ సంస్థ ఉత్పత్తులు కొన్ని తయారవుతున్నాయి. మ్యాక్ ప్రో కంప్యూటర్ ని ఇటీవల కాలిఫోర్నియాలో ప్రదర్శనకు ఉంచినప్పుడు అది అనేకమంది దృష్టిని ఆకర్షించింది. దీని ధరను 6 వేల అమెరికన్ డాలర్లు గా నిర్ణయించారు. 2018 లో అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ మొదలైనప్పటి నుంచి చైనా నుంచి దిగుమతి అయ్యే అన్ని వస్తువులమీదా ట్రంప్ ప్రభుత్వం టారిఫ్ లను పెంచింది. అలాగే అమెరికా నుంచి తాము దిగుమతి చేసుకునే సరకులపైనా చైనా సుంకాలను పెంచింది. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్యా టారిఫ్ వార్ కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా యాపిల్ సంస్థ తన కొత్త కంప్యూటర్ తయారీని చైనాకు మార్చాలని తీసుకున్న నిర్ణయం ట్రంప్ ప్రభుత్వానికి మింగుడుపడడంలేదు.