సముద్ర తీరంలో ఉపగ్రహశకలం ! ముప్పుతప్పదా..?

ప్రకాశం జిల్లాలో మత్స్యకారులు ఉన్నట్టుండి హడలెత్తిపోయారు. ఏక్షణానా ఏం జరుగుతుందోనని భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు ఏమీ కాదని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ వారిని అంతలా కంగారుపెట్టించిన ఆ విషయం ఏంటో తెలిస్తే..మీరు కూడా షాక్‌ అవుతారు. సింగరాయకొండ మండలం పాకల సముద్రతీరంలో ఓ గుర్తుతెలియని వస్తువు సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకువచ్చింది. ఆ వస్తువు చూసేందుకు బాంబు ఆకారంలో ఉండటంతో స్థానిక మత్స్యకారులు భయపడిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటినా […]

సముద్ర తీరంలో ఉపగ్రహశకలం ! ముప్పుతప్పదా..?
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 13, 2019 | 6:27 PM

ప్రకాశం జిల్లాలో మత్స్యకారులు ఉన్నట్టుండి హడలెత్తిపోయారు. ఏక్షణానా ఏం జరుగుతుందోనని భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు ఏమీ కాదని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ వారిని అంతలా కంగారుపెట్టించిన ఆ విషయం ఏంటో తెలిస్తే..మీరు కూడా షాక్‌ అవుతారు. సింగరాయకొండ మండలం పాకల సముద్రతీరంలో ఓ గుర్తుతెలియని వస్తువు సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకువచ్చింది. ఆ వస్తువు చూసేందుకు బాంబు ఆకారంలో ఉండటంతో స్థానిక మత్స్యకారులు భయపడిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటినా బీచ్‌కు చేరిన మెరైన్‌ పోలీసులు, అధికారులు ఆ వింత వస్తువును క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ వస్తువు ఆకాశం నుంచి కిందకు పడిన ఉపగ్రహానికి చెందిన శకలం కావొచ్చునని భావించారు. లేదంటే, ఓడలకు చెందిన ఇంజన్‌లోని ఓ విడి భాగమైనా అయ్యుండాలని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వస్తువు గుట్టు తేల్చేందుకు మెరైన్‌ పోలీసులు బాంబ్‌ స్క్వాడ్ సాయంతో తనిఖీ చేయించారు. ఎట్టకేలకు అది బాంబ్‌ కాదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Latest Articles