9 కోట్ల కరోనా వయల్స్ కోసం.. ఫార్మా కంపెనీలతో బ్రిటన్ ఒప్పందాలు..!

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో బ్రిటన్ ప్రజలకు కరోనా టీకాను వీలైనంత త్వరగా అందుబాటులో తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం వడవడిగా అడుగులు వేస్తోంది. టీకా రూపకల్పన

9 కోట్ల కరోనా వయల్స్ కోసం.. ఫార్మా కంపెనీలతో బ్రిటన్ ఒప్పందాలు..!
Follow us

| Edited By:

Updated on: Jul 21, 2020 | 1:04 AM

UK Secures: కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో బ్రిటన్ ప్రజలకు కరోనా టీకాను వీలైనంత త్వరగా అందుబాటులో తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం వడవడిగా అడుగులు వేస్తోంది. టీకా రూపకల్పన చేస్తున్న కంపెనీలతో ఇటీవల పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఫైజర్‌ ఫార్మా కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా బ్రిటన్ 3 కోట్ల డోసుల సరఫరాకు హామీ పొందింది. అదే విధంగా  ఫ్రెంచ్ కంపెనీ వాల్‌నెవాతో 6 కోట్ల డోసుల కోసం అగ్రిమెంట్ చేసుకుంది.

వంద మిలియన్ల ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ డోసుల కోసం బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే ఆస్ట్రాజెన్‌కాతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ప్రపంచంలో అగ్రగాములైన ఫార్మా కంపెనీలతో ఇలా ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా బ్రిటన్‌కు లాభం చేకూరుతుంది అని బ్రిటన్ బిజినెస్ సెక్రెటరీ అలోక్ శర్మ వ్యాఖ్యానించారు. అయితే ఈ అగ్రిమెంట్ల మొత్తం విలువ ఎంతనేది మాత్రం తెలియరాలేదు.

Also Read: గోవాలో ‘కోవ్యాక్సిన్’ హ్యుమన్ ట్రయల్స్ షురూ..