ఎన్ కౌంటర్ స్థలానికి కుటుంబాలు, ఇద్దరు ఉగ్రవాదుల లొంగుబాటు

ఉగ్రవాదుల లొంగుబాటుకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ వినూత్న పద్ధతులు పాటిస్తున్నారు. బారాముల్లా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగిన స్థలానికి కుర్ర ఉగ్రవాదుల కుటుంబాలను తీసుకువెళ్లారు. అంతే ! ఈ మధ్యే కొత్తగా రిక్రూట్ అయిన ఇద్దరు టెర్రరిస్టులు పోలీసులకు లొంగిపోయారు. ఆబిద్, మెహరాజ్ అనే వీరిని సైనిక దళాలు చుట్టుముట్టాయి. సోపోర్ టౌన్ లోని తుజ్జర్ ప్రాంతంలో ఈ అనూహ్య ఘటన జరిగింది. ఎన్ కౌంటర్ జరిగితే మీ కుటుంబాలు ఎలా ఉంటాయో చూడండంటూ వారిని […]

ఎన్ కౌంటర్ స్థలానికి కుటుంబాలు, ఇద్దరు ఉగ్రవాదుల లొంగుబాటు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 22, 2020 | 8:15 PM

ఉగ్రవాదుల లొంగుబాటుకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ వినూత్న పద్ధతులు పాటిస్తున్నారు. బారాముల్లా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగిన స్థలానికి కుర్ర ఉగ్రవాదుల కుటుంబాలను తీసుకువెళ్లారు. అంతే ! ఈ మధ్యే కొత్తగా రిక్రూట్ అయిన ఇద్దరు టెర్రరిస్టులు పోలీసులకు లొంగిపోయారు. ఆబిద్, మెహరాజ్ అనే వీరిని సైనిక దళాలు చుట్టుముట్టాయి. సోపోర్ టౌన్ లోని తుజ్జర్ ప్రాంతంలో ఈ అనూహ్య ఘటన జరిగింది. ఎన్ కౌంటర్ జరిగితే మీ కుటుంబాలు ఎలా ఉంటాయో చూడండంటూ వారిని అక్కడికి  తీసుకువెళ్లినట్టు ఐజీపీ విజయకుమార్ తెలిపారు. ఆల్ బదర్ ఉగ్రవాద సంస్థలో వీరు చేరారని, కానీ మనసు మార్చుకుని లొంగిపోయారని ఆయన చెప్పారు.