Zomato: హర్యానా నుంచి హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేశాడు.. ఫుల్ గా లాగించేద్దామని ఓపెన్ చేసి చూస్తే..

|

Sep 07, 2022 | 6:03 PM

దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రసిద్ధి చెందిన వంటకాలను రుచి చూడాలనుకునేవారి కోరికలను తీర్చేందుకు ప్రముఖ ఫుడ్ డెలిరీ సంస్థ జొమాటో తీసుకొచ్చిన ఇంటర్‌సిటీ లెజెండ్స్‌ సేవలకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం..

Zomato: హర్యానా నుంచి హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేశాడు.. ఫుల్ గా లాగించేద్దామని ఓపెన్ చేసి చూస్తే..
Hyderabad Biryani
Follow us on

Zomato: దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రసిద్ధి చెందిన వంటకాలను రుచి చూడాలనుకునేవారి కోరికలను తీర్చేందుకు ప్రముఖ ఫుడ్ డెలిరీ సంస్థ జొమాటో తీసుకొచ్చిన ఇంటర్‌సిటీ లెజెండ్స్‌ సేవలకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ఈసేవలు అందిస్తోంది. అయితే ఈసేవల ద్వారా కొంత మంది తమకు ఇష్టమైన ఫుడ్ లాగించేస్తూ హ్యాపీగా ఫీలవుటుంటే.. కొంతమందికి మాత్రం ఈసేవలు చేదు అనుభవాలను మిగులుస్తున్నాయి. అయితే జొమాటో లో షేర్ హోల్డర్ గా ఉన్న ఓ వ్యక్తి.. తమ కంపెనీ కొత్త సేవలను ఆనందిద్దామని ట్రై చేసి.. చేదు అనుభవాన్ని పొందాడు. సాధారణ కస్టమర్లు అయితే ఈఅనుభవాన్ని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కాని షేర్ హోల్డర్ కావడంతో ఈవిషయాన్ని సిరీయస్ గా తీసుకుని.. తన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు ఇది సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే.. గురుగ్రామ్‌కు చెందిన ప్రతీక్‌ కన్వాల్‌ ఇటీవల జొమాటో ఇంటర్‌సిటీ లెజెండ్స్‌ సేవలను ఆస్వాదిద్దామని ప్రయత్నించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌ నుంచి చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ చేశారు. అయితే జొమాటో ఆయనకు బిర్యానీకి బదులుగా సాలన్‌ (బిర్యానీకి సైడ్‌ డిష్‌గా ఇచ్చే వంటకాన్ని) మాత్రమే డెలివరీ చేసింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన ప్రతీక్‌.. ట్విటర్ వేదికగా తన చేదు అనుభవాన్ని వివరించారు.

జొమాటో ఇంటర్‌సిటీ లెజెండ్‌ సర్వీస్‌ మంచి ఐడియా అనిపించింది. కానీ దీని వల్ల నా డిన్నర్‌ ప్లాన్స్‌ గాల్లో కలిశాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనకు ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఓ కస్టమర్‌గా, జొమాటో షేర్ హోల్డర్ గా ఇది నాకు రెట్టింపు నష్టమే. ఈసేవలు అందించడంలో వైఫల్యం ఎక్కడుందో సంస్థ సీఈవో దీపిందర్‌ గోయల్‌ వెంటనే గుర్తించాలి. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడాలంటూ ట్విట్టర్ పోస్టులో రాశారు. జొమాటో, దీపిందర్‌ గోయల్‌ ట్విటర్‌కు ఈ ట్వీట్‌ను ట్యాగ్‌ చేశారు. ప్రతీక్ కన్వాల్ ట్వీట్‌పై జొమాటో కస్టమర్‌కేర్‌ సర్వీస్‌ వెంటనే స్పందించింది. ప్రతీక్‌కు క్షమాపణలు చెప్పడంతో పాటు అదనంగా మరో బిర్యానీని కూడా అందించింది. ఈ విషయాన్ని కూడా ప్రతీక్‌ ట్వీట్టర్ లో పంచుకున్నారు. ప్రస్తుతానికి సమస్య పరిష్కారమైందని.. కనీసం కస్టమర్‌ కేర్‌ సర్వీస్‌ అయినా వేగంగా స్పందించినందుకు ఓ వాటాదారుగా కొంత సంతృప్తి చెందినట్లు పేర్కొన్నారు. మొత్తం మీద తన టెస్టీ ఫుడ్ ను ఫుల్ గా లాగించేద్దామనుకున్న ప్రతీక్ కు ఎదురైన చేదు అనుభవంపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..