Viral Video: పురికొస లాంటి వింత జీవిని ఎప్పుడైనా చూశారా.. షాకింగ్ వీడియో వైరల్

|

Jan 21, 2023 | 8:43 PM

వింత జీవి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూడడానికి ఆక్టోపస్ లాగా ఉంది. అయితే వాస్తవానికి ఇది ఆక్టోపస్ కాదు. ఎందుకంటే దీనికి 5 కాళ్లు మాత్రమే ఉన్నాయి..  అదే సమయంలో అది పాములా పాకుతుంది

Viral Video: పురికొస లాంటి వింత జీవిని ఎప్పుడైనా చూశారా..  షాకింగ్ వీడియో వైరల్
Weird Creature Video
Follow us on

సృష్టిలో అనేక వింత జీవులున్నాయి. వాటిల్లో ఒకటి సముద్ర జీవి అయిన  ఆక్టోపస్‌. ఇది చూడటానికి వింతగా కనిపిస్తుంది.. ఎందుకంటే దీనికి ఒకటి రెండు కాదు మొత్తం 8 వైపులా కాళ్లు ఉంటాయి.. ఈ జీవి జెల్లీ లా సాగుతూ కనిపిస్తూ చాలా వింతగా అనిపిస్తుంది. ఆక్టోపస్ గురించి అందరికీ తెలిసినప్పటికీ.. ఇలాంటి వింత జీవులు భూమిపై చాలా జీవులు నివసిస్తున్నాయి. వాటి  విచిత్రమైన నిర్మాణం కారణంగా ప్రజలను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ప్రస్తుతం అటువంటి వింత జీవి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూడడానికి ఆక్టోపస్ లాగా ఉంది. అయితే వాస్తవానికి ఇది ఆక్టోపస్ కాదు. ఎందుకంటే దీనికి 5 కాళ్లు మాత్రమే ఉన్నాయి..  అదే సమయంలో అది పాములా పాకుతుంది. ఈ జీవిని మొదటి సారి చూస్తే ఎవరైనా భయపడతారు.

మెల్లగా పాకుతూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఈ వింత జీవిని ఓ వ్యక్తి తన చేతిపై ఉంచుకున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఈ దృశ్యాన్ని ఇంకా చాలా మంది చూస్తున్నారు. బహుశా ఎవరూ ఇలాంటి జీవిని చూడలేదు. ఇలాంటి జీవిని ఎప్పుడైనా చూసారా?  చూసి ఉండకపోవచ్చు. నిజానికి వింతగా కనిపించే ఈ జీవి పేరు బ్రిటిల్ స్టార్స్. ఇది సముద్ర జీవి. ఇది అన్నిచోట్లా కనిపించదు. ప్రజలు దీనిని ‘నిగూఢమైన’ లేదా వింత జీవిగా పరిగణించడానికి ఇదే కారణం.

ఇవి కూడా చదవండి

వింత జీవి వైరల్ 

ఈ వింత జీవి వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో beautiful_new_pix అనే ఐడితో షేర్ చేయబడింది. ఇప్పటివరకు 1 లక్ష కంటే ఎక్కువ వ్యూస్ ను 2 వేల మందికి పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది.

అదే సమయంలో, ఈ వీడియోను చూసిన ప్రజలు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇది ఎలాంటి జీవి’ అని కొందరు అడుగుతుండగా, ‘ఇప్పటి వరకు అలాంటి జీవిని చూడలేదు’ అని కొందరు చెబుతుండగా, ఒక వినియోగదారు ఈ జీవిని ‘పెళుసైన నక్షత్రం’గా పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..