Viral Video: వేదికపైనే వధువు చెల్లికి ముద్దు పెట్టేసిన వరుడు.. సీన్ కట్ చేస్తే.!

ఇంటర్నెట్‌లో ఫన్ కంటెంట్ కొదవ లేదు. ఎప్పుడు చూసినా ఏదొక వీడియో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక పెళ్లిళ్లకు సంబంధించిన..

Viral Video: వేదికపైనే వధువు చెల్లికి ముద్దు పెట్టేసిన వరుడు.. సీన్ కట్ చేస్తే.!
Marriage Video

Updated on: Sep 23, 2022 | 1:54 PM

ఇంటర్నెట్‌లో ఫన్ కంటెంట్ కొదవ లేదు. ఎప్పుడు చూసినా ఏదొక వీడియో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు అయితే తెగ చక్కర్లు కొడతాయి. పెళ్లిళ్లలో జరిగే చిలిపి పనులు అన్నీఇన్నీ కాదు.. వధూవరుల స్నేహితుల అల్లరి, మరదలి చిలిపి సరసాలు, అమ్మలక్కల కబుర్లు.. ఇలా పెళ్లిలో చాలానే జరుగుతాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం..

వైరల్ వీడియో ప్రకారం.. వేదికపై ఉన్న వరుడికి.. వధువు చెల్లి స్వీట్ తినిపించాలని అనుకుంటున్నట్లు మీరు చూడవచ్చు. ఆమె చేతిలో ఉన్న స్వీట్‌ను మనోడు తినడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఈలోపు ఆమె కూడా స్వీట్ తినాలని చూస్తుంది. ఈ క్రమంలోనే వరుడి పెదాలు వధువు చెల్లి బుగ్గలకు తగులుతాయి. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక వధువు చెల్లికేమో సిగ్గు మొగ్గలు అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా, ఈ వీడియోను ‘bhutni_ke-memes’ అనే ఇన్‌స్టా పేజీ అప్‌లోడ్ చేసింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.