Viral Video: ప్రేమంటే ఇదే మరి.. ఆడపిల్లే అదృష్ట దేవతంటూ.. ఈ వ్యక్తి చేసిన పనికి ఫిదా అవుతోన్న నెటిజన్లు!

ఆడపిల్ల పుడితే అయ్యో అని బాధపడే రోజులు పోయాయి.. ఇప్పుడు ఆడపిల్ల పుడితే అదృష్ట దేవత వచ్చిందంటూ కొంతమంది సంబరాలు..

Viral Video: ప్రేమంటే ఇదే మరి.. ఆడపిల్లే అదృష్ట దేవతంటూ.. ఈ వ్యక్తి చేసిన పనికి ఫిదా అవుతోన్న నెటిజన్లు!
Trending

Updated on: Apr 09, 2022 | 7:35 PM

ఆడపిల్ల పుడితే అయ్యో అని బాధపడే రోజులు పోయాయి.. ఇప్పుడు ఆడపిల్ల పుడితే అదృష్ట దేవత వచ్చిందంటూ కొంతమంది సంబరాలు చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే ఇక్కడొక వ్యక్తి తనకు పుట్టిన ఆడపిల్లను అదృష్ట దేవతగా భావించి ఏం పని చేశాడో చూస్తే మీరూ కచ్చితంగా ఫిదా కావాల్సిందే.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన గారాల కూతురి పాద ముద్రలను తాను ప్రారంభించబోతున్న మినీ ట్రక్స్‌పై వేస్తున్నట్లు మీరు చూడవచ్చు. తనకు తన కూతురే అదృష్ట దేవత అన్నట్లుగా అతడు చేసిన చర్య నెటిజన్లందరికీ తెగ నచ్చేసింది. ఇక వీడియోలో పాప చిరునవ్వు అందరినీ కట్టిపడేస్తోంది. ఈ విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా, ఈ వీడియోను హర్ష అనే నెటిజన్ ఈ వీడియోను ట్విట్టర్‌లో ఏప్రిల్ 7న అప్‌లోడ్ చేయగా.. ఇప్పటివరకు దీనికి మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 5.8 లక్షల మంది లైక్ కొట్టారు. ‘సూపర్‌.. సూపర్.. సూపర్’ అంటూ ఒకరు కామెంట్ చేయగా.. ‘ఆడపిల్లలను అదృష్ట దేవతలగా భావించే తల్లిదండ్రులకు హాట్సాఫ్’ అంటూ మరొకరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ అద్భుతమైన వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Also Read: వామ్మో! ఈ కి’లేడి’ మహా ముదురు.. ఏకంగా ప్రైవేట్ పార్టులోనే దాచిపెట్టేసిందిగా.. అది చూసి పోలీసుల అవాక్!

Follow Us