Viral Video: వామ్మో! నీకో దండం సామీ.. 12 అడుగుల కింగ్ కోబ్రాను ఇట్టే పట్టేశాడుగా..

పాముల విషయంలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు.. ఒకరు వాటిని చూసి భయపడేవారైతే.. మరొకరు వాటిని రక్షించేవారు.

Viral Video: వామ్మో! నీకో దండం సామీ.. 12 అడుగుల కింగ్ కోబ్రాను ఇట్టే పట్టేశాడుగా..
King Cobra

Updated on: Sep 19, 2022 | 2:00 PM

పాముల విషయంలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు.. ఒకరు వాటిని చూసి భయపడేవారైతే.. మరొకరు వాటిని రక్షించేవారు. వీరినే స్నేక్ క్యాచర్స్ అని కూడా అంటారు. స్నేక్ క్యాచర్స్‌ది ఈజీ లైఫ్ ఏం కాదు.. ఎప్పుడూ ప్రాణాలు రిస్క్ చేయాల్సిందే. ఈ కోవలోనే ఓ స్నేక్ క్యాచర్ 12 అడుగుల భారీ సైజ్ కింగ్ కోబ్రాను భలేగా పట్టుకున్నాడు. ఇది కొంచెం పాత వీడియో అయినప్పటికీ.. ప్రస్తుతం మరోసారి వైరల్‌గా మారింది.

కేరళలోని ఓ కొండ ప్రాంతంలో సుమారు 12 అడుగుల భారీ సైజ్ కింగ్ కోబ్రా ఒకటి సంచరిస్తోందని.. స్థానికంగా ఉండే స్నేక్ క్యాచర్ సురేష్‌కు సమాచారం అందింది. విషయం తెలిసిన వెంటనే స్పాట్‌కు చేరుకున్న సురేష్.. కింగ్ కోబ్రా కోసం వెతకడం ప్రారంభిస్తాడు. అక్కడే ఉన్న కొన్ని బండరాళ్లను అతడు తొలగిస్తుండగా.. కింగ్ కోబ్రా ఒక్కసారిగా బయటికి వచ్చి.. అతడ్ని కాటేయడానికి ప్రయత్నిస్తుంది. సురేష్ చాకచక్యంగా తప్పించుకుంటాడు. మళ్లీ మళ్లీ కాటేయడానికి కింగ్ కోబ్రా ప్రయత్నించగా.. సురేష్ దాని తోక పట్టుకుని తెలివైన టెక్నిక్ ఉపయోగించి దాన్ని సంచిలో బంధిస్తాడు.. ఆ తర్వాత స్థానికంగా ఉన్న అడవిలోకి తీసుకెళ్లి వదిలేస్తాడు. కాగా, ఈ వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు దీనిపై వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ చూసేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us