Viral Video: 90 ఏళ్ల బామ్మకు బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఆమె ఆనందాన్ని చూస్తే మీ కంట కన్నీరు ఆగదు..

Viral Video: కుటుంబ సభ్యులను(Family Members),బంధువు(Relatives)లను దేవుడిస్తే.. స్నేహితుల(friends)ను మాత్రం.. మన ఇష్టాలను, అభిరుచులను అనుసరించి ఎంచుకుంటాం.. కొంతమందితో స్నేహం..

Viral Video: 90 ఏళ్ల బామ్మకు బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఆమె ఆనందాన్ని చూస్తే మీ కంట కన్నీరు ఆగదు..
Viral Video

Updated on: Mar 02, 2022 | 10:56 AM

Viral Video: కుటుంబ సభ్యులను(Family Members),బంధువు(Relatives)లను దేవుడిస్తే.. స్నేహితుల(friends)ను మాత్రం.. మన ఇష్టాలను, అభిరుచులను అనుసరించి ఎంచుకుంటాం.. కొంతమందితో స్నేహం.. ఎప్పుడు మొదలవుతుందో.. ఎప్పుడు ముగుస్తుందో తెలియదు… కానీ బెస్ట్ ఫ్రెండ్ అనే వారు మాత్రం.. జీవితంలో చివరి వరకూ మన సుఖ సంతోషాల్లో తోడుంటారు. మన కష్టనష్టలను వారు ఇష్టంగా భరిస్తారు. అందుకనే ప్రతి వ్యక్తి జీవితంలో బెస్ట్ బడ్డీ ఒకరైనా ఉండాలని అప్పుడే మానసికంగా సంతోషముగా ఉంటామని చెబుతారు. అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో 90 ఏళ్ల వృద్ధురాలు తన పుట్టినరోజును జరుపుకోవడం.. అదే సమయంలో తన  బెస్ట్‌ఫ్రెండ్‌ను చూసి ఆశ్చర్యపోవడంకనిపిస్తుంది. ఈ వీడియో ఖచ్చితంగా చూసిన వారి హృదయాన్ని ద్రవింపజేస్తుంది.

వీడియోలో, ఒక మహిళ తన 90వ పుట్టినరోజును జరుపుకుంటున్నప్పుడు.. ఆ బామ్మ బెస్ట్ ఫ్రెండ్ వచ్చి “ఈ సీటు తీసుకున్నారా” అని అడిగింది. సడెన్ గా తన స్నేహితురాలిని చూసిన ఆనందంలో ఆ బామ్మ స్పందన చాలా మనోహరంగా ఉంది. వృద్ధ మహిళ తన స్నేహితురాలిని గుర్తించిన తర్వాత ఆనందంతో ఆమె తన ముఖాన్ని కప్పుకుని బిగ్గరగా వావ్ అని అరుస్తుంది.

తన అమ్మమ్మ సంతోషన్ని మనవరాలు వీడియో తీసి.. ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.  ఈ వీడియో గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ పోస్ట్ చేస్తూ..  “అమ్మమ్మ తన బెస్ట్ ఫ్రెండ్‌ని చూసి ఆశ్చర్యపోయింది.. ఇది భూమిపై అత్యంత మధురమైన విషయం కాకపోతే.. 90వ ఏట మీరు ఆశ్చర్యపడే విధంగా చేసే మీ బెస్ట్ ఫ్రెండ్‌ని ట్యాగ్ చేయండి” అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ  పోస్ట్ చేసిన ఆరు గంటల్లోనే 1.3 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకోవడంతో వైరల్‌గా మారింది. “ఇది చాలా మధురమైన క్షణం.. ఆ బామ్మకు సంతోషంగా ఉంది” అని ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు కామెంట్ చేశారు. ఈ మనోహరమైన క్షణాలను వీడియో గా అందించారు హృదయపూర్వక అభినందనలు అని మరొకరు కామెంట్ చేశారు.

Also Read:

విన్‌జో బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంఎస్ ధోని.. ఇండియాను గేమింగ్ పవర్‌హౌస్‌గా మార్చేస్తామంటూ ప్రకటన..

 

Loading...
Unable to load recommendations.
Follow Us