దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో సామాన్య మానవుడి జీవన స్థితి గతుల గురించి తెలిసిందే.. స్థానికుల పరిస్థితి తెలిసిందే. ముఖ్యంగా పని, ఉద్యోగం కోసం వెళ్లేవారితో పాటు.. చదువు కోసం వెళ్లే స్టూడెంట్స్ కూడా అనేక అష్టకష్టాలు పడతారు. ముఖ్యంగా కొన్ని గంటలు ప్రయాణించి మరీ తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు. అయితే ఈ సమయంలో ప్రయాణీకులు కూర్చోవడానికి సీటు కోసం నానారకాల ఫీట్లు చేస్తారు. కొన్నిసార్లు రద్దీని తట్టుకోలేని ప్రయాణికులు తోపులాటలకు కొట్లాటకు దిగుతారు కూడా. ఇది మాత్రమే కాదు కొంతమంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరీ ప్రయాణం చేస్తారు. అయితే ప్రతిసారీ ఇలా ప్రయాణించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ప్రజలు తమ అభిరుచిని నెరవేర్చడానికి కూడా రకరకాల ఫీట్లతో ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.
దేశంలో ద్రవ్యోల్బణం ఎలా పెరుగుతుందో అదే విధంగా మహా నగరాల్లో కూడా జనాభా కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. దీని ప్రభావం ముంబై ప్రాంతాల్లో లోకల్ బస్సులు, బస్సులపైనా కనిపిస్తోంది. తమ గమ్య స్థానం చేరుకోవడానికి ప్రయాణిస్తూ తమ ప్రాణాలను పణంగా పెట్టే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే కదులుతున్న బస్సు మీద ఒక యువకుడు విన్యాసాలు చేస్తూ కనిపిస్తాడు.
A student was spotted dangerously standing on a small ledge of a crowded BEST bus while holding onto the bottom of the window at Carter Road to Peace Haven bus stop in Bandra. This incident serves as a reminder to prioritize safety and avoid risky behavior. pic.twitter.com/CsDxt5uuYk
— Bandra Buzz (@bandrabuzz) November 29, 2023
నివేదిక ప్రకారం ఈ ఘటన ముంబైలోని బాంద్రా ప్రాంతానికి చెందినది. రద్దీగా ఉండే చోట ప్రయాణం చేయడానికి బస్సు వెనుక నిచ్చెన పట్టుకుని ఒక యువకుడు సంతోషంగా ప్రయాణిస్తున్నట్లు కనిపించింది. బస్సు వెనుక నెంబర్ ప్లేట్ దగ్గర నిలబడి వెనుక కిటికీ పట్టుకుని ప్రయాణిస్తున్న ఓ యువకుడి స్టంట్ చూసి ఇంటర్నెట్ జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆ యువకుడు ఏ మాత్రం కాస్త పొరపాటు చేసినా ఘోర ప్రమాదం జరిగి ఉండేది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతోంది. ఇది చూసిన జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..