Viral Video: అగ్నిప్రమాదంలో చిక్కుకున్న తల్లి.. తన రెండేళ్ల చిన్నారిని కిటికీలోంచి విసిరేసింది.. షాకింగ్ వీడియో..

|

Jul 15, 2021 | 9:50 PM

Viral Video: ఒళ్లు గగుర్పాటుకు గురయ్యే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే దేవుడా.. అని అంటారు. అగ్ని

Viral Video: అగ్నిప్రమాదంలో చిక్కుకున్న తల్లి.. తన రెండేళ్ల చిన్నారిని కిటికీలోంచి విసిరేసింది.. షాకింగ్ వీడియో..
Mother
Follow us on

Viral Video: ఒళ్లు గగుర్పాటుకు గురయ్యే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే దేవుడా.. అని అంటారు. అగ్ని ప్రమాదానికి గురైన ఓ భవనం నుంచి ఓ తల్లి తన బిడ్డను రక్షించుకునేందుకు కిందకు విసేరింది. ఈ సీన్‌ను కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దక్షిణాఫ్రికాలోని దర్బన్ సిటీలోని ఓ బిల్డింగ్‌‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ మంటల్లో చాలా మంది చిక్కుకున్నారు. రెస్క్యూ సిబ్బంది, స్థానిక ప్రజలు బిల్డింగ్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు. కొందరు పైనుంచి దూకగా.. వారిని కింద ఉన్న వారు పట్టుకుని కాపాడారు. ఈ మంట్లోనే ఓ తల్లి, రెండేళ్ల చిన్నారి కూడా చిక్కుకున్నారు. దాంతో ఏం చేయాలో, ఎలా తప్పించుకోవాలో ఆ తల్లికి అర్థం కాలేదు. అయితే, తమనకు కాపాడాలంటూ కింద ఉన్న వారిని ఆ తల్లి వేడుకుంది. దాంతో కొందరు బిల్డింగ్ బాల్కానీపైకి ఎక్కారు. వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆ తల్లి తన రెండేళ్ల చిన్నారిని కిటికీలోంచి కిందకు విసిరింది. కింద ఉన్న వారు వెంటనే అలర్ట్ అయి.. ఆ చిన్నారిని రక్షించారు. అనంతరం ఆ తల్లిని కూడా కాపాడారు. చివరికి ఇద్దరూ సేఫ్‌గా బయటపడ్డారు.

అగ్ని ప్రమాదానికి గురైన భవనాన్ని వీడియో తీయగా.. ఈ ఘటన కూడా అందులో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆ తల్లి గట్టిగా అరుస్తున్నట్లుగా కనిపిస్తుంది. మంటల వ్యాప్తి తీవ్రత పెరుగుతుండటంతో తమను కాపాడాలంటూ వేడుకుంటున్నట్లుగా ఆ వీడియోలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. మొత్తానికి తల్లి, బిడ్డ క్షేమంగా బయటపడటంతో హమ్మయ్య అనుకుంటున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన ఆ తల్లి మీడియాతో మాట్లాడింది. తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితిని వివరిస్తూ.. తాము ప్రాణాలతో బయటపడటంతో సంతోషం వ్యక్తం చేసింది. తనను, తన కూతురిని కాపాడిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

Viral Video:

Also read:

AP-TS Water Disputes: ఆంధ్రా-తెలంగాణ జలవివాదం.. ఏపీ సీఎం జగన్‌పై సంచలన కామెంట్స్ చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి..

Telangana Corona Updates: తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. అయినా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న అధికారులు..

Viral Photos: బెడ్ కింద పాముల కుప్ప.. తాడు ముక్కలనుకుని కదిలించిన మహిళ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..