Viral Video: Viral Video: అధ్యక్షా.. లైఫ్ అంటే ఇట్టా ఉండాలా.. ఈ కోతి వీడియో చూస్తే మీరు ఇదే అంటారు..

|

Jul 26, 2022 | 6:17 PM

జంతువులకు సంబంధించి ఫన్నీ క్లిప్‌లను చూడటం వల్ల మన మానసిక స్థితి ఉల్లాసంగా మార్చేస్తుంది. అందుకే అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో సూపర్ వైరల్ అవుతాయి.

Viral Video: Viral Video: అధ్యక్షా.. లైఫ్ అంటే ఇట్టా ఉండాలా..  ఈ కోతి వీడియో చూస్తే మీరు ఇదే అంటారు..
Monkey
Follow us on

Viral Video: కోతులు అంటేనే చిలిపి చేష్టలు, అల్ల‌రికి కేరాఫ్ అడ్ర‌స్ అని చెప్పొచ్చు. వాటి చేష్ట‌లతో మనుషులకు ఎన్నో రకాల ఇబ్బందులు, తలనొప్పిని తెచ్చిపెడుతుంటాయి. ఉన్న ఏ చోట అవి కుదురుగా ఉండవు..అటూ ఇటూ గెంతుతూ..చెట్ల మీద నుండి మరో చెట్టు మీదకి దూకుతుంటాయి. అడవులు, గుట్టలకు దగ్గరగా ఉండే గ్రామాలలో కోతులు ఎక్కువగా వస్తుంటాయి. ఇక ప్రస్తుత కాలంలో అడవులు అంతరించిపోవటం కారణంగా అవి ఎక్కువగా జనావాసాల్లోనే చేరిపోయాయి. గ్రామాలు, పట్టణాల్లో ప్రస్తుతం కోతుల బెడద ఎక్కువగా ఉంది..అవి ఇళ్లలోకి దూరి తినే పదార్థాలను పట్టుకుని క్షణాల్లో మాయమై పోతంటాయి. అయితే, అడవుల్లో ఉండే, ఓ కోతి ఏం చేసిందో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అది చేసిన పని చూస్తే అవాక్కవ్వాల్సిందే..ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్‌ అవుతోంది.

జంతువుల వీడియోలను ఎవరు ఇష్టపడరు చెప్పండి… వెర్రి,తెలివితక్కువ పనులు చేసే జంతువులకు సంబంధించి ఫన్నీ క్లిప్‌లను చూడటం వల్ల మన మానసిక స్థితి ఉల్లాసంగా మార్చేస్తుంది. అందుకే అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో సూపర్ వైరల్ అవుతాయి. అయితే, కోతులు తరచుగా మనుషులు చేసే కార్యకలాపాలను అనుకరించే కొంటె జీవులుని నిరూపించుకుంటుంటాయి. అవి మనుషులను చూసి వేగంగా నేర్చుకుంటాయి. అటువంటిదే ఇక్కడ వీడియోలో ఒక కోతి ఫుల్‌ జోష్‌తో లైఫ్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక కోతి భలేగా ముస్తాభైంది. ఓ తాడుపై కూర్చుని ఉయ్యాల ఊగుతూ అరటిపండ్లు ఆరగిస్తోంది.. కళ్లకు కూలింగ్‌ గ్లాస్‌, చెవిలో పూలు పెట్టుకుని గోవా బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న మోడల్ స్టైల్లో ఫోజు కొడుతోంది. ఈ వీడియో ఫిగెన్ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి