Video: ఓరి నీ దుంపతెగ.. కట్టేసిన కుక్కకే దమ్కీ ఇద్దామనుకున్నాడు.. కట్‌చేస్తే.. క్షణాల్లోనే సీన్ రివర్స్

Viral Video Dog Attack Lesson: నోరు లేని జీవాలను ప్రేమించకపోయినా పరవాలేదు కానీ, వాటిని హింసించే హక్కు మనుషులకు లేదు. ఈ వైరల్ వీడియో కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన ఒక నైతిక పాఠం. ప్రకృతి ఎప్పుడూ న్యాయం వైపే ఉంటుందని, మనం చేసే తప్పులకు తక్షణమే శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.

Video: ఓరి నీ దుంపతెగ.. కట్టేసిన కుక్కకే దమ్కీ ఇద్దామనుకున్నాడు.. కట్‌చేస్తే.. క్షణాల్లోనే సీన్ రివర్స్
Karma Dog Viral Video
Image Credit source: https://twitter.com/haber_io/

Updated on: Jun 05, 2026 | 1:34 PM

Karma Viral Video: నెరవేరని స్వార్థం, మూగజీవాలపై చూపే క్రూరత్వం ఒక్కోసారి మనిషికే శాపంగా మారుతుంటాయి. మనదేశంలో ఒక వింత సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక పెంపుడు కుక్కకు హాని చేయాలని చూసిన వ్యక్తికి, ఊహించని రీతిలో బుద్ధి చెప్పిన సీన్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

మూగజీవంపై అకారణంగా ఆగ్రహం..

మన చుట్టూ ఉండే వీధి కుక్కలు లేదా ఇతర జంతువులు అకారణంగా ఎవరికీ హాని చేయవు. కొన్నిసార్లు అదుపు తప్పి హాని చేస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ, కొందరు మనుషులు తమలోని కోపాన్ని లేదా విసుగును ఈ మూగజీవాలపై చూపిస్తూ ఆనందం పొందుతుంటారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో కూడా ఒక వ్యక్తి రోడ్డుపై ప్రశాంతంగా ఉన్న ఒక కుక్కను చూసి అనవసరంగా రెచ్చిపోయాడు. దాన్ని భయపెట్టాలని, అలాగే కొట్టాలనే ట్రై చేశాడు. దానిముందుకు వెళ్లి మరీ డ్యాన్స్‌లు చేస్తూ కుక్కను రెచ్చగొడతాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Video: అర్ధరాత్రి 1 గంట.. నిర్మానుష్య రోడ్డుపై ఓ వ్యక్తి.. కట్‌చేస్తే.. ఆ తర్వాత సీన్ చూస్తే..!

క్షణాల్లో కొట్టిన కర్మ.. జన్మలో మర్చిపోలేని పాఠం!

అయితే, ఆ కుక్కను కొట్టడానికి సదరు వ్యక్తి ప్రయత్నించిన మరుక్షణమే ఊహించని షాక్ తగిలింది. అప్పటి వరకు కట్టేసి ఉన్న కుక్క.. ఒక్కసారిగా చైన్ తెంచుకుని ఆ వ్యక్తివైపు దూసుకెళ్లింది. ఇంకేముంది లగెత్తురా మావా అంటూ కిందపడుతూ, మీదపడుతూ పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో అనేకసార్లు కిందపడ్డాడు. తాను అనుకున్న పని చేయకపోగా, స్వయంగా తనే తీవ్రమైన గాయాలపాలై విలవిలల్లాడిపోయాడు. ‘మనం ఏది ఇస్తే.. సమాజం మనకు దాన్నే తిరిగి ఇస్తుంది’ అనేదానికి ఈ సంఘటన ఒక నిదర్శనంగా నిలిచింది.

ఇది కూడా చదవండి: Video: అక్కా.. నీకో దండం.. ఛాన్స్ ఇస్తే ఎనుగునే ఎక్కించేట్టున్నావుగా.. ఈ వీడియో చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే..!

సామాజిక మాధ్యమాల్లో ‘కర్మ’పై చర్చల పర్వం..

ఈ వీడియో సామాజిక మాధ్యమ ప్లాట్‌ఫారమ్ అయిన ‘ఎక్స్’ (ట్విట్టర్) లో షేర్ అయిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించడమే కాకుండా, పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. “ప్రకృతి ఎప్పటికప్పుడు లెక్కలు సరిచేస్తుంది అనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ” అని కొందరు కామెంట్లు పెడుతుంటే, “మూగజీవాల జోలికి వెళ్తే ఇలాగే తక్షణమే శిక్ష పడుతుంది” అని మరికొందరు జంతు ప్రేమికులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Video: Video: నీ జిమ్మడిపోను.. ఒక్క క్షణంలో పక్కనోళ్లకు హార్ట్ ఎటాక్ తెప్పించావుగా.. వీడియోలో ఫైనల్ ట్విస్ట్ అదుర్స్..!

మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us