Viral Video: తల్లి శిక్షణలో గర్జించడం నేర్చుకుంటున్న సింహం పిల్ల.. క్యూట్ వీడియో వైరల్

|

Jun 27, 2022 | 1:20 PM

ఒక సింహం పిల్ల తన తల్లి చుట్టూ ఆడుతూ గర్జించడం ఎలాగో నేర్చుకుంటున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో క్యూట్ గా ఉండి నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

Viral Video: తల్లి శిక్షణలో గర్జించడం నేర్చుకుంటున్న సింహం పిల్ల.. క్యూట్ వీడియో వైరల్
Lion Video Viral
Follow us on

Viral Video: అడవికి రారాజు సింహం.. సింహం గర్జిస్తే చాలు అందరికీ భయమే.. మ‌నుషులే కాదు.. ఇతర జంతువులు కూడా ఆ గ‌ర్జన వింటే ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్‌ అన్నట్లు పారిపోతాయ్‌. ఇదిలా ఉంటే ఈ రారాజు గర్జన అయితే విన్నారు కానీ.. సింహం పిల్ల గర్జన ఎప్పుడైనా విన్నారా.. తాజాగా నెట్టింట్లో సింహం పిల్ల గర్జిస్తున్న వీడియో వైరల్‌ అవుతోంది. ఒక సింహం పిల్ల తన తల్లి చుట్టూ ఆడుతూ గర్జించడం ఎలాగో నేర్చుకుంటున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో క్యూట్ గా ఉండి నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

ఈ అందమైన , ఫన్నీ జంతువుల వీడియోలను క్రమం తప్పకుండా షేర్ చేసే ‘Buitengebieden’ పేజీ ద్వారా క్లిప్‌ను ట్విట్టర్‌లో షేర్‌చేశారు. ఒక శక్తివంతమైన గర్జన పురోగతిలో ఉంది” అని క్యాప్షన్ ఇచ్చారు ఈ వీడియోకి. ఈ వీడియోలో ఓ మూడు నుంచి నాలుగు నెల‌ల వ‌య‌స్సున్న సింహం పిల్ల త‌న త‌ల్లి చుట్టూ తిరుగుతూ ఉంది. అప్పుడే గర్జించ‌డం నేర్చుకుంటుంది. ఆ పిల్ల సింహం గ‌ర్జన అచ్చం పిల్లి అరుస్తున్నట్లు ఉంది. వింటుంటే అది సింహం పిల్లా… పిల్లి పిల్లా అనిపిస్తుంది. కానీ సింహం సింహమే.. పిల్లి పిల్లే… ఆ సింహం కూన పిల్లిలా అరిచినా ఆ గర్జనలో గాంభీర్యం మాత్రం తగ్గలేదు. కాగా ఈ వీడియో నెటిజ‌న్లను బాగా ఆక‌ట్టుకుంటుంది. ఈ వీడియోను లక్షలమంది వీక్షిస్తూ.. వేలల్లో లైక్స్‌తో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..