Viral Video: అబ్బా! ఎంత సిగ్గో అమ్మాయి గారికి.. డ్యాన్స్ రీల్ చేస్తూ దొరికిపోయింది.. కట్ చేస్తే!

|

May 18, 2022 | 7:30 AM

Trending Video: సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని మనసుకు హత్తుకుంటే.. మరికొన్ని ఫన్నీగా ఉంటాయి..

Viral Video: అబ్బా! ఎంత సిగ్గో అమ్మాయి గారికి.. డ్యాన్స్ రీల్ చేస్తూ దొరికిపోయింది.. కట్ చేస్తే!
Viral Video
Follow us on

స్టేజ్ ఫియర్.. ఈ భావన చాలామందిలో ఉంటుంది. వీరు అందరి ముందు పెర్ఫార్మ్ చేయడానికి చాలా సిగ్గు లేదా భయపడుతుంటారు. మీ గ్యాంగ్‌లోనూ ఇలాంటివాళ్లు ఉంటారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. తాజాగా ఓ అమ్మాయి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూశాక మీరు కూడా అయ్యబాబోయ్.! మరీ ఇంత సిగ్గా.? అని అంటారు.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ అమ్మాయి తన ఫ్రెండ్ సహాయంతో టెర్రాస్‌పై ఇన్‌స్టా రీల్స్‌ కోసం డ్యాన్స్ వీడియోను షూట్ చేస్తోంది. పాపం.. ఆ ఇద్దరు అమ్మాయిలు మేడ మీద ఇంకెవ్వరూ లేరని ఊహించి.. తమ పనిలో నిమగ్నమైపోయారు. అయితే ఆ ఫోన్‌లో షూట్ చేస్తోన్న అమ్మాయి.. ఎప్పుడైతే మూడో వ్యక్తి వాళ్లను గమనిస్తున్నారని గుర్తిస్తుందో.. ఇద్దరూ కూడా సిగ్గుతో తుర్రుమని లోపలికి పరుగుపెడతారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియోను ‘memes.bks’ అనే ఇన్‌స్టా పేజీ సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేయగా.. ఇప్పటిదాకా దీనికి 20 వేలకు పైగా వ్యూస్, 1900 లైకులు వచ్చాయి. ‘బాబోయ్ మరీ ఇంత సిగ్గా’ అంటూ నెటిజన్లు ఫాన్నీ కామెంట్స్‌తో హోరెత్తించారు.