Video: ఎలా వస్తాయ్ రా బాబు.. ప్లేట్‌తో 5స్టార్ హోటల్‌ను తలదన్నే షవర్.. వీడి ఐడియా చూస్తే మైండ్ బ్లాంకే..!

Desi Jugaad Homemade Shower: సోషల్ మీడియాలో ఒక వినూత్నమైన దేశీ జుగాడ్ వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక పళ్లెం ఉపయోగించి చౌకైన, సులువైన షవర్‌ను తయారు చేయడం కనిపిస్తుంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.

Video: ఎలా వస్తాయ్ రా బాబు.. ప్లేట్‌తో 5స్టార్ హోటల్‌ను తలదన్నే షవర్.. వీడి ఐడియా చూస్తే మైండ్ బ్లాంకే..!
Desi Jugaad Homemade Shower

Updated on: Jun 06, 2026 | 8:31 AM

Desi Jugaad Homemade Shower: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వింతలు, విశేషాలు మనకు దర్శనమిస్తుంటాయి. అయితే, సామాన్యుడి సృజనాత్మకతకు అద్దం పట్టే కొన్ని అద్భుత ఆవిష్కరణలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఒక వీడియోలో, ఒక వ్యక్తి వంటింటి పాత్రతో తక్కువ ఖర్చుతో కూడిన లగ్జరీ షవర్‌ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

నెటిజన్లను ఫిదా చేస్తున్న అద్భుత సృజనాత్మకత..

సమస్య ఏదైనా కావచ్చు, దానికి మన భారతీయులు కనిపెట్టే ‘జుగాడ్’ (చిట్కా) మాత్రం అమోఘం. ఖరీదైన వస్తువులు కొనలేకపోయినా, అందుబాటులో ఉన్న వస్తువులతోనే పని కానిచ్చేయడంలో మనవాళ్లకు సాటి ఎవరూ లేరని ఈ వీడియో మరోసారి నిరూపించింది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక సరికొత్త దేశీ జుగాడ్ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో ఒక సామాన్య వ్యక్తి ఇంట్లో ఉండే అత్యంత సాధారణ పాత్రను ఉపయోగించి, ఏకంగా బాత్రూమ్‌లో విలాసవంతమైన షవర్‌ను సిద్ధం చేశాడు. దీన్ని చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి ఐడియాకు జేజేలు పలుకుతున్నారు.

వంటింటి పళ్లెంతో హైటెక్ షవర్..

ఈ వైరల్ వీడియో ప్రారంభంలో ఒక వ్యక్తి రంధ్రాలు ఉన్న ఒక పెద్ద స్టీల్ పళ్లెన్ని చూపిస్తాడు. సాధారణంగా పిండి కలపడానికో లేదా కూరగాయలు కడగడానికో వాడే ఈ పాత్రతో అతను ఏం చేయబోతున్నాడో మొదటి క్షణంలో ఎవరికీ అర్థం కాదు. కానీ, కొద్ది సెకన్లలోనే అతను తన మైండ్ బ్లోయింగ్ ప్లాన్‌ను అమలు చేసి చూపించాడు.

ఇది కూడా చదవండి: Viral Video: ఏమన్నా ఐడియానా బాస్.. రోడ్డుపై నడిచే స్విమ్మింగ్‌ పూల్‌.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

ఆ పళ్లాన్ని తీసుకుని బాత్రూమ్‌లోకి వెళ్లిన సదరు వ్యక్తి, దానిని గోడకు పైభాగంలో తలక్రిందులుగా అమర్చాడు. ఆ పాత్రకు మధ్యలో ఒక పైపును కనెక్ట్ చేశాడు. ఆ పైపు రెండో చివరను కింద ఉన్న నీటి నల్లాకు అనుసంధానించాడు. అంటే, నల్లా తిప్పగానే నీరు పైపు ద్వారా నేరుగా పైనున్న రంధ్రాల పళ్లెంలోకి చేరుకునేలా పక్కా ప్లాన్ వేశాడన్నమాట.

నల్లా తిప్పితే.. 5 స్టార్ హోటల్ ఫీలింగ్..!

అంతా సిద్ధమయ్యాక ఆ వ్యక్తి నల్లాను ఆన్ చేసి చూపిస్తాడు. అంతే.. నల్లా నుంచి వచ్చిన నీరు పైపు ద్వారా పైకి వెళ్లి, ఆ పళ్లెంలో ఉన్న చిన్న చిన్న రంధ్రాల గుండా ఒకేసారి కిందికి చిమ్మడం ప్రారంభమైంది. ఆ నీటి ధారలు ఎంత అందంగా పడుతున్నాయంటే, ఏదో పెద్ద హోటల్‌లోని లేటెస్ట్ షవర్ నుంచి నీరు వస్తున్నట్లే అనిపిస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో, ఇంట్లో వృధాగా ఉన్న వస్తువులతోనే ఇంతటి అద్భుతాన్ని సృష్టించడం నిజంగా ప్రశంసనీయం.

‘అవసరమే ఆవిష్కరణకు మూలం’ అంటూ కామెంట్ల వర్షం..

ఈ అద్భుతమైన దేశీ షవర్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారినప్పటి నుంచి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “మన గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ప్రతిభావంతులు ఎందరో ఉన్నారు” అని కొందరు కొనియాడుతుంటే, మరికొందరు మాత్రం “అవసరమే ఆవిష్కరణకు మూలం అంటే ఇదేనేమో” అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ సరికొత్త హోమ్‌మేడ్ షవర్ ఐడియా ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇది కూడా చదవండి: Video: రోడ్డుపై ఓ మూటతో నిల్చున్న వ్యక్తి.. ఆటోను ఆపి డ్రైవర్‌ను పిలిచాడు.. సీన్ కట్‌చేస్తే.. ట్విస్ట్ మాములుగా లేదుగా..!

సాంకేతికత లేదా ఖరీదైన పరికరాలు లేకపోయినా, కేవలం ఆలోచన శక్తితో అద్భుతాలు చేయవచ్చని ఈ వీడియో నిరూపించింది. సామాన్యుడి మేధస్సుకు అద్దం పట్టే ఇలాంటి దేశీ జుగాడ్స్, వినోదాన్ని పంచడమే కాకుండా నిజ జీవిత సమస్యలకు సులువైన పరిష్కారాలను కూడా చూపిస్తాయి.

మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us