Viral Video: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. ఎప్పుడూ ఇలా ట్రై చేయకండి..!

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని భయంకరంగా ఉంటే మరికొన్ని హాస్యాస్పదంగా ఉంటాయి. ఒక్కోసారి కొన్ని

Viral Video: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. ఎప్పుడూ ఇలా ట్రై చేయకండి..!
Train Accident

Updated on: Apr 12, 2022 | 11:40 AM

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని భయంకరంగా ఉంటే మరికొన్ని హాస్యాస్పదంగా ఉంటాయి. ఒక్కోసారి కొన్ని ప్రమాదాలకి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంటాయి. నెటిజన్లు వీటిని ఎక్కువగా చూస్తారు. లైక్స్‌, కామెంట్స్‌తో హోరెత్తిస్తారు. ఇలాంటి వీడియోలకి ఇంటర్‌నెట్‌లో ఆదరణ ఎక్కువగా ఉంటుంది. సోషల్‌ మీడియాలో వీటిపై తెగ చర్చ నడుస్తుంది. తాజాగా ఒక రైలు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియో చేస్తే మీరు కూడా షాక్‌ అవుతారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందాం. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక రైల్వే గేట్‌ క్లోజ్‌ చేసి ఉండటం మనం గమనించవచ్చు. కానీ హఠాత్తుగా ఒక బైక్ రైడర్‌ ట్రాక్‌ దాటడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో రైలు వేగంగా రావడంతో బైక్‌ వదిలేసి అక్కడి నుంచి పక్కకు తప్పుకోవడానికి ప్రయత్నిస్తాడు.

అయితే రైలు వేగానికి బైక్‌ చిత్తు చిత్తు అవుతుంది. అంతేకాదు ఆ వ్యక్తి త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడటం మనం వీడియోలో చూడవచ్చు. కొద్దిగా ఆలస్యమైతే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేవాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోని ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇప్పటివరకు ఈ వీడియోని 6 లక్షల 21 వేల మంది చూశారు. అంతేకాదు 33 వేల మందికి పైగా లైక్ చేసారు. నెటిజన్లు ఈ వీడియోను చూసిన తర్వాత వివిధ రకాల రియాక్షన్‌లు ఇస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్‌ తెలియజేయండి.

Cricket News: అద్భుతం.. వరుసగా 6 బంతుల్లో 6 వికెట్లు.. రెండు పరుగులు..!

Back Pain: నడుంనొప్పులకి శస్త్రచికిత్స తప్పనిసరి కాదు.. కొన్నిటిని ఇలా తగ్గించుకోవచ్చు..!

Health Tips: అన్నం తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!

Loading...
Unable to load recommendations.
Follow Us