Viral Video: ఎంతకు తెగించార్రా.. అంబులెన్స్‌ను ఓయోగా మార్చిన కిలాడీలు.. ఇదిగో వీడియో

ఎమర్జెన్సీలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించే 108 అంబులెన్స్‌ను కొందరు యువకులు దుర్వినియోగం చేస్తున్నారు. ఏకంగా అంబులెన్స్‌ను మూవింగ్ ఓయోగా మార్చి అందులో అసభ్య కార్యకలాపాలు సాగించారు. తాజాగా ఓ యువతి, ఇద్దరు యువలకు అంబులెన్స్‌లో అసభ్యకర పనులు చేస్తూ స్థానికులకు పట్టుబడ్డారు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: ఎంతకు తెగించార్రా.. అంబులెన్స్‌ను ఓయోగా మార్చిన కిలాడీలు.. ఇదిగో వీడియో
108 Ambulance Turned Into Moving Oyo Viral Video

Updated on: Apr 24, 2026 | 8:32 AM

సాధారణంగా అంబులెన్స్‌ను ఎందుకు ఉపయోగిస్తారు. ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే వెంటనే హాస్పిటల్‌కు తరలించేందుకు అంబులెన్స్‌ను ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ కొందరు యువకులు మాత్రం ప్రజారోగ్యానికి బాసటగా నిలిచిన 108 అంబులెన్స్‌ను ఏకంగా ఓయోరూమ్‌గా మార్చేశారు. అందులో అసభ్యకరంగా రొమాన్స్ చేస్తూ స్థానికులకు పట్టుబడ్డారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో ప్రకారం.. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో వెలుగు చూసింది.రోడ్డుపై వెళ్తున్న ఓ అంబులెన్స్‌లో యువతి ఇద్దరు యువకులు అసభ్యకరంగా రొమాన్స్ చేయడం కిటిలోంచి స్థానికులకు కనిపించింది. అది గమనించిన స్థానికులు వెంటనే ఆ అంబులెన్స్‌ను ఆపేందుకు ప్రయత్నించారు. సుమారు 5 కిలోమీటర్ల మేర అంబులెన్స్‌ను వెంబడించి చివరికి ఆపేశారు. అంబులెన్స్ డోర్ తిసి చూడగా అందులో ఓ యువతి ఇద్దరు యువకులు కనిపించారు.

అంబులెన్స్‌లో అడ్డంగా బుక్కైన యువతి, ఇద్దరు యువకులు ఇదిగో వీడియో 

అయితే స్థానికులు అంబులెన్స్‌ పరిశీలించినప్పుడు అందులో ఎమర్జెన్సీకి సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు లేవని చెబుతున్నారు. మరి మీరు ఏం చేస్తున్నారని సదురు యువకులను ప్రశ్నించగా, వారు తమను తాము కుటుంబ సభ్యులమని చెప్పుకుంటూ తప్పించుకోవడానికి ప్రయత్నించినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు అంబులెన్స్‌ ఏకంగా ఓయో రూమ్‌ తరహాలో రెడీ చేశారని స్థానికులు చెబుతున్నారు. అలాగే ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశారు.

దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారి ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. ఈ ఘటనపై స్పందించిన అధికారులు ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ అంబులెన్స్ డ్రైవర్‌ను విధుల్లో నుంచి తొలగించి, ఘటనపై విచారణకు ఆదేశించారు.

Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్‌, నివేదికల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడింది. దీనిని TV9 దృవీకరించడం లేదు

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us