Viral Photo: 3 నల్ల త్రాచులు ఒకేసారి ఒకేచోట పడగలు విప్పితే ఎట్టా ఉంటుందో తెలుసా..?

పాము అంటే చాలామందికి భయం ఉంటుంది. అది చిన్న పాము అయినా సరే ఆమడ దూరం పరిగెడతారు. అలాంటిది నల్ల త్రాచు పడగ విప్పి కనిపించిందంటే..?

Viral Photo: 3 నల్ల త్రాచులు ఒకేసారి ఒకేచోట పడగలు విప్పితే ఎట్టా ఉంటుందో తెలుసా..?
Viral Photo 3 Cobras

Updated on: Nov 18, 2021 | 9:12 AM

పాము అంటే చాలామందికి భయం ఉంటుంది. అది చిన్న పాము అయినా సరే ఆమడ దూరం పరిగెడతారు. అలాంటిది నల్ల త్రాచు పడగ విప్పి కనిపించిందంటే.. ఇక వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అలాంటి నల్ల త్రాచులు మూడు పగడ విప్పి.. ఒకే చోట ఉంటే పై ప్రాణాలు పైనే పోతాయి. అది కూడా కూడబలుక్కున్నట్టుగా మూడు ఓకే చెట్టుకు మెలివేసుకుని ఉన్నాయి. ఈ షాకింగ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా హరిసల్ అడవుల్లో ఈ ఫోటోను క్లిక్ చేసినట్లు తెలుస్తోంది. జనావాసాల్లోకి వచ్చిన పాములను రక్షించి అడవుల్లోకి వదిలేసిన తర్వాత ఈ ఫోటో తీసినట్లు సమాచారం. ఇండియన్ వైల్డ్‌లైఫ్ అనే ఫేస్‌బుక్ గ్రూప్‌లో ఈ ఫోటోలు తొలిసారిగా దర్శనమిచ్చాయి. రాజేంద్ర సెమల్కర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఈ ఫోటోలను షేర్ చేశాడు. రాజేంద్ర సెమాల్కర్ షేర్ చేసిన ఫోటోల్లో ఒక‌దాన్ని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.  “బ్లెస్సింగ్స్… మూడు నాగుపాములు ఒకేసారి మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు” అనే క్యాప్షన్‌ను జోడించారు.

 

ఈ ఫోటో చూసిన నెటిజ‌న్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.  ‘ఒక్క క్షణం భ‌యంతో వణుకువచ్చింది’…  ‘దూరం నుంచి చూస్తే ఫోటో అందరంగా ఉంది.. దగ్గరకెళ్తే ఖేత్ ఖతం’, ‘ఇలాంటి ఫోటోలను అరుదుగా మాత్రమే చూడగలం’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: Viral Video: సమయానికి దేవుడిలా వచ్చాడు.. కాపాడాడు.. లేదంటే నిండు ప్రాణాలు…

Follow Us