Viral Photo: వావ్.. వాట్ ఏ క్రియేటివిటీ.. కాళ్లకు బురద అంటకుండా వీటిని ట్రై చేయండి.. నెట్టింట్లో ఫన్నీ ఫోటో వైరల్..

Viral Photo: ఈ పోటీ ప్రపంచంలో క్రియేటివిటీ లేకపోవతే రాణించడం అసాధ్యం. జీవితంలో ఉన్నత స్థాయిలకు ఎదగాలంటే సమాజ పోకడలను గమనిస్తూ..

Viral Photo: వావ్.. వాట్ ఏ క్రియేటివిటీ.. కాళ్లకు బురద అంటకుండా వీటిని ట్రై చేయండి.. నెట్టింట్లో ఫన్నీ ఫోటో వైరల్..
Social Media

Updated on: Oct 12, 2021 | 2:12 PM

Viral Photo: ఈ పోటీ ప్రపంచంలో క్రియేటివిటీ లేకపోవతే రాణించడం అసాధ్యం. జీవితంలో ఉన్నత స్థాయిలకు ఎదగాలంటే సమాజ పోకడలను గమనిస్తూ.. ఎప్పటికప్పుడు చోటుచేసుకుంటున్న మార్పులను అవగతం చేసుకుంటూ అందుకు తగ్గట్లుగా మలుచుకోవాలి. అప్పుడు ఆశించిన విజయం సాధించగలం. ముఖ్యంగా ఫ్యాషన్ రంగంలో రోజుకో కొత్త రకం ప్రోడక్ట్స్ మార్కెట్‌లోకి విడుదల అవుతుంటాయి. తాజాగా అలాంటి ప్రోడక్ట్ ఒకటి మార్కెట్‌లో విడుదలైంది. అయితే, దానికంటే ముందే ఆ ప్రోడక్ట్ ఫోటో వైరల్‌గా మారింది. ఇక ఆ ఫోటోను మన దేశ ప్రజలు, నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు. ఇంతకీ ఆ ఫోటో ఏంది? అంతలా ట్రోల్ చేయడానికి కారణమేంటి? వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా చాలా మంది అమ్మాయిలు హైహిల్స్ వేసుకుంటారు. ఫ్యాషన్‌ లుక్‌లో ఉండే హైహిల్స్‌కే మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే, తాజాగా ఇప్పటి వరకు ఎన్నడూ లేని కొత్త రకం హైహిల్స్‌కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పక్షి కాళ్ల రూపంలో తయారు చేసిన ఆ హై హిల్స్‌‌ని మోడల్ ధరించింది. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, ఆ హైహిల్స్‌ని మరో విధంగా వాడేసుకుంటున్నారు జనాలు. గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఆ వర్షాల కారణంగా పలు రాష్ట్రాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఇక ఈ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో రోడ్లు బురదమయం అయ్యాయి. అయితే, తాజాగా వైరల్‌ అవుతున్న హైహిల్స్ ఫోటోని, ఆ బురద మడుగులకు కంపేర్ చేస్తూ నెటిజన్లు రచ్చ రచ్చ చేస్తున్నారు. బురదలో కాళ్లు తడవకుండా ఉండాలంటే వీటిని ధరించండి అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. మన దేశ ప్రజలకు ఈ హైహిల్స్ చాలా అవసరం అని, వీటిని ధరించడం ద్వారా బురద నుంచి సేవ్ అవ్వొచ్చంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

Also read:

Viral Video: నీ ఆత్మ విశ్వాసానికి హ్యాట్సాఫ్ సోదరా!.. విధి రాతను ఓడించి ఒంటి కాలితో..

Hyderabad News: పొంగి పొర్లిన మందు.. అమ్మాయిలతో చిందులు.. అంతలోనే ఊహించిన ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..

PM Narendra Modi: అలాంటి వారితో దేశానికి ప్రమాదం.. అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని మోదీ

Follow Us