Viral News: పెట్రోల్‌ బంకులో చోరీ చేశాడు.. పోలీసులకు దొరక్కుండా 14ఏళ్లు గుహలో దాక్కున్నాడు.. చివరకు..

కానీ కాలం గడిచేకొద్దీ అక్కడ నివసించడం మరింత కష్టతరంగా మారింది. మోఫును కలవడం కోసం అతని స్నేహితులు ఆహారం కూడా తెచ్చేవారు. తన రక్షణ కోసం కుక్కను కూడా పెంచుకున్నాడు.

Viral News: పెట్రోల్‌ బంకులో చోరీ చేశాడు.. పోలీసులకు దొరక్కుండా 14ఏళ్లు గుహలో దాక్కున్నాడు.. చివరకు..
Petrol Bunk Theft

Updated on: Mar 06, 2023 | 9:24 PM

ఓ చైనా వ్యక్తి పెట్రోల్ బంకులో డబ్బు దొంగిలించి 14 ఏళ్లుగా గుహలో దాక్కున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2009లో మోఫు అనే వ్యక్తి తన సహచరులతో కలిసి పెట్రోల్ బంకులో 156 యువాన్ (భారత కరెన్సీలో రూ. 1859) దొంగిలించాడు. తర్వాత పోలీసుల నుంచి తప్పించుకునేందుకు గుహలో తల దాచుకుని 14 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉండి చివరకు పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన చైనాలోని హుబే ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఎన్షి సిటీకి చెందిన లియు మోఫు అనే వ్యక్తి పెట్రోల్ బంకు నుండి డబ్బు దొంగిలించాడు. మోఫు, అతని సహచరులు దోచుకున్న డబ్బులో 60 యువాన్లు ఖర్చు చేశారు. మిగిలిన డబ్బును పంచుకున్నారు. విచారణ అనంతరం మోఫు సహచరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

మోఫు ఆశ్రయం కోసం నగరానికి దూరంగా ఉన్న పర్వతాలలోని ఒక గుహను ఎంచుకున్నాడు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ తక్కువగా ఉంది. ఫలితంగా మోఫు సురక్షితంగా ఉన్నాడు. కానీ కాలం గడిచేకొద్దీ అక్కడ నివసించడం మరింత కష్టతరంగా మారింది. మోఫును కలవడం కోసం అతని స్నేహితులు ఆహారం కూడా తెచ్చేవారు. తన రక్షణ కోసం కుక్కను కూడా పెంచుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో 14 ఏళ్లు గడిపిన మోఫు.. కుటుంబసభ్యుల అభ్యర్థన మేరకు పోలీసులకు లొంగిపోయాడు.

ఇవి కూడా చదవండి

వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Loading...
Unable to load recommendations.
Follow Us