Viral News: విడాకులు ఇప్పించండి మహా ప్రభో నా భార్యకు వంట కాదు కదా.. పండ్లు కోయడం కూడా రాదంటూ విలపిస్తున్న భర్త

|

Oct 15, 2024 | 8:09 PM

తన భార్యకు ఇంటిపనులు చేయడం తెలియదని భర్త విడాకులు కోరాడు. అవును తన భార్య వంట చేయడం పక్కన పెడితే.. ఆమెకు కనీసం కత్తి పట్టుకుని సరిగా పండు కూడా కోయడం రాదు అంటూ ఆ భర్త సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన పోస్ట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో పంచుకున్నారు. 28 ఏళ్ల యువకుడు తన సమస్యను పంచుకున్నాడు.

Viral News: విడాకులు ఇప్పించండి మహా ప్రభో నా భార్యకు వంట కాదు కదా.. పండ్లు కోయడం కూడా రాదంటూ విలపిస్తున్న భర్త
Viral News
Follow us on

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో చిన్న చిన్న కారణాలతో విడాకులు తీసుకుంటున్న విషయాలు తెలుస్తున్నాయి. నా భర్త వంట చేయడు, కప్పు టీ కూడా చేయడు, ఇంటి పనుల్లో కూడా సహాయం చేయడు అని మహిళలు తమ భర్తలపై ఫిర్యాదు చేయడం వంటి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇందుకు విరుద్ధమైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తన భార్యకు ఇంటిపనులు చేయడం తెలియదని భర్త విడాకులు కోరాడు. అవును తన భార్య వంట చేయడం పక్కన పెడితే.. ఆమెకు కనీసం కత్తి పట్టుకుని సరిగా పండు కూడా కోయడం రాదు అంటూ ఆ భర్త సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

దీనికి సంబంధించిన పోస్ట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో పంచుకున్నారు. 28 ఏళ్ల యువకుడు తన సమస్యను పంచుకున్నాడు. ఈ పోస్ట్‌లో తన భార్యకు వంట చేయడం తెలియదని, కత్తి పట్టుకోవడం కూడా సరిగా తెలియదని వాపోయాడు.

AITA for agreeing with my mom that it’s kind of pathetic my wife can’t cook
byu/Plastic_Voice_6229 inAmItheAsshole

ఇవి కూడా చదవండి

28 ఏళ్ల వ్యక్తికి ఏడాది క్రితం 31 ఏళ్ల మహిళతో వివాహమైంది. భార్య ఇంటి పనులు చేయడం రాకపోవడంతో భర్త వంట చేసి వడ్డించాల్సి వచ్చింది. తర్వాత ఇది సమస్యగా మారిందని ఆ భర్త పేర్కొన్నాడు. ఒకరోజు రాత్రి నేను వంట చేయడానికి పదార్ధాలను సిద్ధం చేసుకున్నాను.. అప్పుడు మా అమ్మ భా భార్యను పండ్లు కోసి పెట్టమని కోరింది. అయితే తన భార్యకు కనీసం పండ్లు కూడా సరిగ్గా కట్ చేయడం రాలేదు. సరి కదా కనీసం కత్తి కూడా సరిగ్గా పట్టుకోలేక పోయింది. ఇది చూసి మా అమ్మకు కోపం వచ్చింది. కత్తిని సరిగ్గా పట్టుకోలేకపోవడం నిజంగా సిగ్గుచేటని కోడలితో చెప్పింది. అయితే తన భార్యను వంటలు నేర్పించే కోర్సులో చేర్పిస్తానని.. వంట నేర్చుకుంటే సరి.. బద్దకంతో వంట నేర్చుకోకుంటే తన భార్యకు విడాకులు ఇస్తానని వెల్లడించాడు సదరు భర్త.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..