Viral Video: వామ్మో.! నాగుపాముల సయ్యాట.. వీడియో చూస్తే షాకవుతారు.!

| Edited By: Anil kumar poka

Nov 06, 2021 | 1:33 PM

సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తే కొంతమంది చచ్చేంత భయం. మరికొందరు అయితే వాటితో ఆటలు ఆడుకుంటున్నారు...

Viral Video: వామ్మో.! నాగుపాముల సయ్యాట.. వీడియో చూస్తే షాకవుతారు.!
Snakes
Follow us on

సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తే కొంతమంది చచ్చేంత భయం. మరికొందరు అయితే వాటితో ఆటలు ఆడుకుంటున్నారు. అదే వారి పని కూడా. ఇదిలా ఉంటే.. ఒక్క పామును చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది ఒకే చోటు రెండు పాములను చూస్తే.. ఇంకేమైనా ఉందా.! గుండె జారిపోతుంది కదూ.. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీపక్ కుమార్ సింగ్ అనే నెటిజన్ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోను చూశాక మీకు కూడా షాకింగ్ ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో రెండు పాములు ఇంచక్కా సేద తీరుతూ.. ఒకదానితో మరొకటి సయ్యాటలు ఆడటం మీరు చూడవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

కాగా, 1.32 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు వరుసపెట్టి లైకులు, కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ”అసలు ఇంతకీ ఆ పాములు ఇంతకీ అక్కడ ఏం చేస్తున్నాయి” అని ఒకరు కామెంట్ చేయగా.. నాగ్, నాగినిల మధ్య ఓ అందమైన మూమెంట్ అని మరొకరు ఫన్నీ కామెంట్ చేశారు. ఏది ఏమైనా వీడియో మాత్రం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. లేట్ ఎందుకు మీరూ చూసేయండి మరి.

Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు

డ్రైవర్‌ సీటుకి వెనుకవైపు ఉన్న సందేశం చూసి ఆశ్చర్య పోయిన ప్యాసింజర్.. ఇంతకీ ఆ సందేశం ఏంటో తెలుసా..?? వీడియో

ఫోన్‌లో ఆడుతూ రూ.61 వేలకి ఆర్డర్‌ చేసిన చిన్నారి… పెట్టిన ఆర్డర్ చూసి షాక్ అయిన తల్లిదండ్రులు.. వీడియో

ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్‌ రెస్టారెంట్‌.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??