Viral Video: మీరే కాదు.. మేము కూడా ఆడగలం.. గోల్ఫ్ బాల్‏తో చెడుగుడు ఆడిన పక్షి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

సోషల్ మీడియాలోనే కాదు మన చుట్టూ ఉన్న చాలా పెంపుడు జంతువులు వాటి యజమానులతో ఆడుకోవడం మనం చూసి ఉంటాం. ఇందులో చాలా సార్లు కుక్కలు తమ యజమానులతో బంతితో..

Viral Video: మీరే కాదు.. మేము కూడా ఆడగలం.. గోల్ఫ్ బాల్‏తో చెడుగుడు ఆడిన పక్షి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Bird Making A Splash With T

Updated on: Apr 28, 2022 | 9:55 AM

సోషల్ మీడియాలోనే కాదు మన చుట్టూ ఉన్న చాలా పెంపుడు జంతువులు వాటి యజమానులతో ఆడుకోవడం మనం చూసి ఉంటాం. ఇందులో చాలా సార్లు కుక్కలు తమ యజమానులతో బంతితో ఆడుకోవడం కనిపించింది. ఇటీవల ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి(Viral Video) చేస్తోంది.  యూజర్లను ఈ వీడియో విపరీతంగా ఆకట్టుకుంది. వైరల్ అవుతున్న క్లిప్‌లో పక్షి గోల్ఫ్ ఆడుతున్నట్లు చూడవచ్చు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గోల్ఫ్ కోర్స్‌లో పడి ఉన్న బంతులతో పక్షి పరుగెత్తుతు ఆడుకోవడం ఈ వీడియోలో మనం చూడచ్చు. ముందుగా అది తన నోటిలో పట్టుకోవడం కనిపిస్తుంది. తొలిచూపు చూస్తుంటే.. ఆహారాన్ని తీసుకుని పరిగెడుతున్నట్లుగా అనిపిస్తుంది. అది ఓ సాకర్ ప్లేయర్ స్థాయిలో బంతిని ఆడుకోవడం ఈ వీడియోలో మనం చూడవచ్చు.

ఈ వీడియోలో పక్షి తన ముక్కుతో గోల్ఫ్ బంతిని నేలపై కొట్టడం కనిపిస్తుంది. ఆ తర్వాత అది ఆడుకుంటూ కనిపిస్తుంది. వీడియోలో మరోసారి ఇలా చేస్తున్నాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ సామ్రాట్ గోదా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

వీడియోను పంచుకోవడంతో పాటు, ‘సరదాలన్నీ మనుషులకు మాత్రమే చేయకూడదు, పక్షులు కూడా గోల్ఫ్ క్రీడాకారులుగా మారవచ్చు’ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం, ఈ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇది వార్తలు రాసే సమయానికి సోషల్ మీడియాలో 20 వేలకు పైగా వ్యూస  వచ్చాయి.

ఇవి కూడా చదవండి: Donald Trump: ట్రంప్‌ రోజూ 10 వేల డాలర్లు జరిమానా కట్టాలటా.. ఎందుకో తెలుసా?

Andhra vs Odisha: ఆంధ్రా- ఒడిశా బోర్డర్‌లో టెన్షన్‌.. కోడిగుడ్ల లారీల అడ్డగింత.. రైతుల ఆందోళన..!

Loading...
Unable to load recommendations.
Follow Us