Kabaddi Dance: స్కూల్ స్టేజ్‌పైనే పిల్లల రచ్చ.. ‘దేశం వీడిపోకూడని టాలెంట్’ అంటున్న నెటిజన్లు..

చిన్నతనంలో మనందరం కూడా కబడ్డీ ఆడే ఉంటాం. ‘కబడ్డీ కబడ్డీ’ అనుకుంటూ ప్రత్యర్థి కోర్టులోకి వెళ్లి వస్తుంటాం. అయితే ఎప్పుడైనా డ్యాన్స్ వేసుకుంటూ కూతకు వెళ్లారా..? లేదా స్కూల్ స్టేజీ మీద కబడ్డీ ఆడారా..? అసలు ఇలా చేయాలన్న ఆలోచన కూడా మనకు తట్టలేదు కదా.. అయితే ఇలా చేసిన..

Kabaddi Dance: స్కూల్ స్టేజ్‌పైనే పిల్లల రచ్చ.. ‘దేశం వీడిపోకూడని టాలెంట్’ అంటున్న నెటిజన్లు..
Kabaddi Dance

Updated on: Apr 10, 2023 | 6:20 AM

నిత్యం సోషల్ మీడియాలో చాలా వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. వాటిలో పిల్లలకు సంబంధించినవి, డ్యాన్స్‌కి సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి. ఇక చిన్నతనంలో మనందరం కూడా కబడ్డీ ఆడే ఉంటాం. ‘కబడ్డీ కబడ్డీ’ అనుకుంటూ ప్రత్యర్థి కోర్టులోకి వెళ్లి వస్తుంటాం. అయితే ఎప్పుడైనా డ్యాన్స్ వేసుకుంటూ కూతకు వెళ్లారా..? లేదా స్కూల్ స్టేజీ మీద కబడ్డీ ఆడారా..? అసలు ఇలా చేయాలన్న ఆలోచన కూడా మనకు తట్టలేదు కదా.. అయితే ఇలా చేసిన స్కూల్ పిల్లలకు సంబంధించిన ‘కబడ్డీ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఫుల్‌గా నవ్వేసుకుంటున్నారు.

ప్రస్తుతం నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఈ వీడియోలో కొందరు పిల్లలు స్కూల్ ప్రోగ్రామ్ జరుగుతున్న కబడ్డీ ఆడుతున్నారు. వారు ఆ సమయంలో ఆట మాత్రమే కాక డ్యాన్స్ కూడా వేస్తున్నారు. అందుకు బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్‌ని కూడా సెట్ చేసుకున్నారు. అయితే ఈ వీడియో ఎక్కడ ఎప్పుడు తీసినదో తెలియరాలేదు కానీ ఏదో స్కూల్ ఫంక్షన్ సందర్భంగా తీసినదని అర్థమవుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు పిచ్చపిచ్చగా నవ్వుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

‘కబడ్డీ డ్యాన్స్’ వీడియోని ఇక్కడ చూడండి..

కాగా, ఈ వీడియోకి ఇప్పటివరకు 113 వేల లైకులు, 16 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. అలాగే అనేక మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఐపీఎల్ డ్యాన్స్ ఉంటుంది కానీ కబడ్డీ డ్యాన్స్ ఉండదని, పిల్లల ఐడియా సూపర్ అని కామెంట్ చేశారు. ఇంకొందరైతే ‘ఈ టాలెంట్ దేశం దాటి వెళ్లకూడనిది..’ అని రాసుకొచ్చారు. ఇలా వీడియోను చూసిన నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us