Man Drinks Urine: వీడు మరీ దారుణంగా ఉన్నాడేంట్రా బాబు.. యవ్వనంగా కనిపించాలంటే ఆది తాగాలంటున్నాడు..!

ఎవడి పిచ్చి వాడికి ఆనందం. కానీ, కొన్నిసార్లు ఆ పచ్చి పనులు చూడాలన్నా, వినాలన్నా వికారం పుట్టేలా ఉంటాయి. అలా వికారం పుట్టే పనే చేశాడు ఇంగ్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి. ఇంగ్లాండ్‌లోని​హ్యాంప్​షైర్‌కు చెందిన 34ఏళ్ల హ్యారీ మాటాదీన్, రోజు తన మూత్రాన్ని తానే తాగుతున్నాడు. అంతేకాదు, అలా చేయడం వల్ల తనకున్న డిప్రెషన్​పోయిందని అంటున్నాడు. పైగా, తన మూత్రాన్ని తానే తాగుతుండటంతో, తన వయస్సు కన్నా 10ఏళ్ల చిన్నవాడిగా కనిపిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు హ్యారీ.

Man Drinks Urine: వీడు మరీ దారుణంగా ఉన్నాడేంట్రా బాబు.. యవ్వనంగా కనిపించాలంటే ఆది తాగాలంటున్నాడు..!
Mr Casey Turned To Urine Therapy

Updated on: Aug 17, 2025 | 10:47 AM

Man Drinks Urine: ఎవడి పిచ్చి వాడికి ఆనందం. కానీ, కొన్నిసార్లు ఆ పచ్చి పనులు చూడాలన్నా, వినాలన్నా వికారం పుట్టేలా ఉంటాయి. అలా వికారం పుట్టే పనే చేశాడు ఇంగ్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి. ఇంగ్లాండ్‌లోని​హ్యాంప్​షైర్‌కు చెందిన 34ఏళ్ల హ్యారీ మాటాదీన్, రోజు తన మూత్రాన్ని తానే తాగుతున్నాడు. అంతేకాదు, అలా చేయడం వల్ల తనకున్న డిప్రెషన్​పోయిందని అంటున్నాడు. పైగా, తన మూత్రాన్ని తానే తాగుతుండటంతో, తన వయస్సు కన్నా 10ఏళ్ల చిన్నవాడిగా కనిపిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు హ్యారీ.

అతనికి గతంలో మానసిక సమస్యలు ఉండేవి. వాటి నుంచి బయటపడాలని ఫిక్స్​అయ్యాడు. అందుకు అతను ‘యూరిన్​ థెరపీ’ని ఎంచుకున్నాడు. 2016 నుంచి తన మూత్రాన్ని తానే తాగుతున్నాడు. అలా చేయడంతో తనకు ప్రశాంతత, శాంతి, సంకల్ప భావాలు పెరిగినట్టు చెబుతున్నాడు హ్యారీ మాటాదీన్. అందరు యూరిన్​థెరపిని ఎంచుతొని, ఎవరి మూత్రం వారే తాగాలని సూచిస్తున్నాడు. రోజుకు 200 ఎమ్‌ఎల్​ మూత్రం తాగుతాడు. నెల రోజుల పాటు నిల్వ ఉంచిన మూత్రాన్ని తీసుకుని, అప్పుడే బయటకొచ్చిన మూత్రాన్ని కలిపి తాగుతాడు. తన యూరిన్ ఎంతో క్లీన్‌గా ఉంటుందని, వాసన, రుచి బాగుంటుందని ఇతరులకు వికారం వచ్చేలా చెబుతున్నాడు హ్యారీ.

యూరిన్ తాగడమే కాదు, దానిని హ్యారీ తన ముఖానికి కూడా రాసుకుంటాడు. అది మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుందని చెబుతున్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత హ్యారీ కుటుంబసభ్యులు అతడిని తిట్టారు. అతను చేస్తున్నదాన్ని ఒప్పుకోలేదు. హ్యరీ చెల్లి అతనితో మాట్లాడటమే మానేసింది. కానీ, చాలా మంది తనకు మద్దతిస్తున్నట్టు చెప్పాడు హ్యారీ. ఇతని ఇష్యూ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చూసిన వారు, ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ దారుణంగా ఉన్నాడేంట్రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read Also…  Viral Video: కోడిగుడ్డపై వెళ్లిన 16 చక్రాల ట్రక్.. అయినా చెక్కు చెదరని గుడ్డు.. నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..!