Viral: వామ్మో.. ఈ దున్న బరువు 1500 కేజీలు.. ఖరీదు ఎంతో తెలిస్తే స్టన్ అవ్వాల్సిందే

|

Jan 29, 2023 | 12:55 PM

బీడ్‌ జిల్లాలో జరుగుతున్న ఓ వ్యవసాయ ప్రదర్శనకు దీన్ని తీసుకొచ్చారు. కోటిన్నర ఇస్తాం దున్నను అమ్మమన్నా.. అందుకు నిరాకరించారు దాని యజమాని.

Viral: వామ్మో.. ఈ దున్న బరువు 1500 కేజీలు.. ఖరీదు ఎంతో తెలిస్తే స్టన్ అవ్వాల్సిందే
Rare Bull
Follow us on

ప్రతి ఏటా దీపావళి తర్వాత హైదరాబాద్‌లో జరిగే సదర్ ఉత్సవాలు చూడాలంటే 2 కళ్లు సరిపోవు. దున్నరాజుల విన్యాసాలు స్పెషల్ ఎట్రాక్షన్ అనే చెప్పాలి. అందంగా అలంకరించిన దున్నపోతులతో కుస్తీ పట్టడమే సదర్‌ స్పెషాలిటీ. ఈ ఉత్సవాలకు వచ్చే దున్నలు ఎంత ధృడంగా, అందంగా ఉంటాయో.. వాటి అలంకరణ ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఓ దున్న ఇప్పుడు మహారాష్ట్రలో హాట్ టాపిక్‌గా మారింది. బీడ్‌ జిల్లాలో జరుగుతున్న ఓ వ్యవసాయ ప్రదర్శనకు కోసం దీన్ని తీసుకువచ్చారు.

ఈ దున్నను చూసి రైతులు ఆశ్చర్యపోతున్నారు. ఈ భారీ దున్నపోతు యజమాని రెడ్యాచే మాలక్‌.. కర్ణాటక బెళగావికి చెందినవారు. ఈ దున్నపోతు పేరు గజేంద్ర. ఈ ప్రదర్శనకు వచ్చిన పంజాబ్‌ రైతులు ఈ దున్నను చూసి ముచ్చటపడ్డారు. దాన్ని కొనేందుకు ఆసక్తి కనబరిచారు. రూ.1.5 కోట్ల ఇచ్చేందుకు ముందుకు వచ్చినా దాని యజమాని మాత్ర నో చెప్పేశాడు.  1,500 కిలోల బరువున్న ఈ దున్న రోజుకు 15 లీటర్ల పాలు తాగుతుందట. అంతేకాదు 2 కిలోల పిండి, 3 కిలోల గడ్డి తింటుందట. ఇలాంటి భారీ దున్నలు తమ దగ్గర 5 ఉన్నాయని సదరు రైతు వెల్లడించారు.  ఇంట్లో మనిషిలా సాకుతున్న ఈ దున్నలను ఎన్ని కోట్లు ఇచ్చినా అమ్మను అని తెగేసి చెబుతున్నాడు రైతు రెడ్యాచే మాలక్‌.

మరిన్ని జాతీయ వార్తల కోసం..