Viral News: పెళ్లిలో వరుడు చెప్పిన మాటకు పూజారి షాక్.. పడి పడి నవ్విన వధువు..

|

Aug 08, 2022 | 7:09 PM

బంధువులు, సన్నిహితుల మధ్య ఎంతో ఘనంగా వివాహం జరుగుతుంది. సంప్రదాయబద్దంగా పెళ్లి తంతు జరిపిస్తున్నాడు పూజారి.

Viral News: పెళ్లిలో వరుడు చెప్పిన మాటకు పూజారి షాక్.. పడి పడి నవ్విన వధువు..
Viral Video
Follow us on

పెళ్లిలో వరుడు, వధువు చేసే అల్లరి పనులు నవ్వులు తెప్పిస్తుంటాయి. అలాగే బంధువులు, సన్నిహితులు ఎంత సరదగా కొత్త దంపతులను ఆట పట్టిస్తుంటారు. ఇటీవల ఇలాంటి ఫన్నీ ఫన్నీ వీడియోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే పెళ్లి జరుగుతుంటే పెళ్లి కుమారుడు చెప్పిన మాటకు పూజారితోపాటు అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. కానీ వధువు మాత్రం నవ్వేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాగ్దానం చేయమంటే ఆ వరుడు తన మనసులోని మాటలను బయటకు చెప్పి షాకిచ్చాడు. ఇంతకీ ఆ వరుడు ఏం చెప్పాడో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే..

బంధువులు, సన్నిహితుల మధ్య ఎంతో ఘనంగా వివాహం జరుగుతుంది. సంప్రదాయబద్దంగా పెళ్లి తంతు జరిపిస్తున్నాడు పూజారి. వధువు, వరుడు పూజారి చెబుతున్న విధంగా వివాహ ఆచారాలను పాటిస్తున్నాయి. అయితే వరుడితో పూజారి వధువుకు సంబంధించిన వాగ్దానం చేయిస్తున్నాడు. అర్ధాంగి.. అని చెబుతూ.. ఆ పదాన్ని పూర్తిగా వివరిస్తూ.. అవే మాటలను చెబుతూ వాగ్దానం చేయమన్నాడు పూజారి. భార్య తన జీవితంలో సగభాగాన్ని పంచుకున్నందుకు ఆమె తన అర్ధాంగి అని పిలుస్తారని పూజారి వరుడికి చెప్పాడు. దీంతో వరుడు మాట్లాడుతూ..భార్య సగం ఎందుకు పంచుకుంటుంది. మొత్తం జీవితాన్నే పంచుకుంటుంది. అన్ని దుఃఖాలు తనవని.. కానీ సుఖ సంతోషాలు ఆమెకు చెందుతాయని చెప్పాడు. దీంతో పూజారి ఒక్కసారిగా షాకవ్వగా.. వధువు మాత్రం పగలబడి నవ్వింది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.