Viral Video: బెడ్ రూమ్‌లో భూతం.. ఆత్మకు హాయ్ చెప్పిన చిన్నారి.. చూసిన తండ్రికి ఫ్యూజులు అవుట్

|

May 01, 2022 | 11:19 AM

దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయా.. లేవా.. అన్న సంగతి పక్కన పెడితే.. దెయ్యం అనే పదం వినిపిస్తే చాలు జనం గజగజ వణికిపోతారు. చనిపోయిన వాళ్లు దెయ్యాలుగా మారి వేధించడం, భయపెట్టడం వంటివి చేస్తుంటారని చాలా మంది నమ్ముతారు.

Viral Video: బెడ్ రూమ్‌లో భూతం.. ఆత్మకు హాయ్ చెప్పిన చిన్నారి.. చూసిన తండ్రికి ఫ్యూజులు అవుట్
Gost
Follow us on

Viral Video: దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయా.. లేవా.. అన్న సంగతి పక్కన పెడితే.. దెయ్యం అనే పదం వినిపిస్తే చాలు జనం గజగజ వణికిపోతారు. చనిపోయిన వాళ్లు దెయ్యాలుగా మారి వేధించడం, భయపెట్టడం వంటివి చేస్తుంటారని చాలా మంది నమ్ముతారు. ఐతే దెయ్యాలు ఉన్నాయా.. లేవా.. అనే దానికి ఇప్పటివరకు క్లారిటీ లేదు. అప్పుడప్పుడు వింత ఆకారాలు కెమెరా కంట్లో పడటంతో అవి దెయ్యాలనే నమ్ముతుంటారు. ఇదిలా ఉంటే, స్కాట్లాండ్‌లో జరిగిన ఓ వింత సంఘటన ఇప్పుడు ఆత్మలు, దెయ్యాలు ఉన్నాయనే వాదనను మళ్లీ తెరపైకి తెచ్చింది. దెయ్యాలు ఉన్నాయి అనేందుకు బలం చేకూర్చే వీడియో ఇది అంటూ నెటిజన్లు సైతం..ఈ వీడియోకి సపోర్ట్ ఇస్తున్నారు.

ఇక్కడ ఓ 2 ఏళ్ల పిల్లవాడు..బెడ్‌రూమ్‌లో తన తండ్రితో పాటు బెడ్‌పై పడుకుని ఉన్నారు. అది రాత్రి సమయం ఇద్దరూ ఇంకా నిద్రపోలేదు…తండ్రి మొబైల్ ఫోన్‌లో బిజీగా ఉన్నాడు..ఇంతలో ఆ చిన్నారి.. గదిలోని ఓ మూలకు చూస్తూ.. ఎవర్నో పలుకరిస్తున్నట్లుగా చెయ్యి పైకి ఎత్తాడు. హాయ్ చెబుతున్నట్లు చెయ్యి ఊపాడు. ఆది చూసిన తండ్రి షాక్‌ అయ్యాడు..”అక్కడ ఎవరున్నారు?” అని అడిగాడు. ఎందుకంటే తండ్రికి అక్కడ ఎవరూ కనిపించలేదు. కానీ పిల్లాడు మళ్లీ మళ్లీ చెయ్యి ఊపుతూ సంబరపడ్డాడు..ఆ తర్వాత ఆ చిన్నారి ఎవరో కితకితలు పెట్టినట్లు కాసేపు నవ్వాడు. ఆ తర్వాత గది నుంచి వెళ్లిపోయేవారికి బాయ్ చెప్పినట్లు చెయ్యి ఊపాడు. అప్పటికీ తండ్రి “ఎవరికి హాయ్ చెబుతున్నావ్?” అని అడిగితే.. గాలిలోకి చెయ్యిని చూపించిన చిన్నారి… అలా కాసేపూ హాయ్ చెప్పి… తర్వాత బెడ్‌పై వాలిపోయాడు. దీంతో ఆశ్చర్యపోయిన తండ్రి ఏం జరిగిందో అర్థం కాక కాసేపు..భయపడిపోయాడు. కానీ,నెమ్మదిగా తేరుకుని ఆలొచించాడు. తన కొడుకుకి కనిపించింది చనిపోయిన బామ్మ అని అర్థమైనట్టుగా చెబుతున్నాడు. ఆమె ఇటీవలే క్యాన్సర్‌‌తో చనిపోయింది. చివరి రోజుల్లో ఆ చిన్నారి.. ఆమెతో ఎక్కువగా గడిపాడట.. బామ్మతో మాత్రమే అలా చేతులు ఊపేవాడనీ, బామ్మ పట్టుకున్నప్పుడు అలా నవ్వేవాడని తెలిపాడు. ఇంకెవరికీ ఇలా చేతులు ఊపలేదని అంటున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral News: బాల్కనీలో దుస్తులు ఆరేస్తే రూ. 20వేల జరిమానా.. ఎక్కడో తెలుసా?

Viral Video: బ్యాండ్ ట్యూన్‌కి అదరగొట్టే స్టెప్పులేసిన డాగీ.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారంతే..

HBD Ajith Kumar: ఆ స్పెషల్ ఉంగరమంటేనే ఇష్టమంటోన్న అజిత్.. మరెన్నో ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..