Viral: గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరు యువతులు.. కామంతో చేయకూడని పని.. కట్ చేస్తే.!

ఓ ఇద్దరు యువతులు.. ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ఆపై శారీరికంగా కలిశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత వారిద్దరూ చేసిన పని గురించి తెలిస్తే అందరూ షాక్ అవుతారు. ఆ స్టోరీ ఏంటో తెలిస్తే మీకు మైండ్ బ్లాంక్ అవుతుంది. ఆ వివరాలు ఇలా..

Viral: గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరు యువతులు.. కామంతో చేయకూడని పని.. కట్ చేస్తే.!
Tamilnadu News

Edited By:

Updated on: Nov 10, 2025 | 12:00 PM

తమిళనాడులో ఐదు నెలల వయసున్న కొడుకును చంపిందన్న ఆరోపణలతో ఓ మహిళను, ఆమె లివిన్ పార్టనర్ అయిన మరో మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు మహిళ భర్త ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. నవంబర్ 5న కృష్ణగిరి జిల్లాలోని చిన్నతి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ చిన్నారికి పాలు ఇస్తుండగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. కంగారుపడ్డ చిన్నారి తండ్రి వెంటనే ప్రభుతాస్పత్రికి తరలించగా.. అప్పటికే శిశువు మరణించినట్టు డాక్టర్లు ధృవీకరించారు.

మొదట్లో సహజంగానే.. ఆపై అనుమానాస్పదంగా

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బిడ్డను తండ్రి కెలమంగళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు చెప్పారు. కుటుంబం మొదట్లో శిశువు మరణం సహజంగానే సంభవించిందని భావించారు. అయితే తండ్రి సురేష్(38).. తన కొడుకు చనిపోవడానికి అతడి భార్య భారతి(26), ఆమె లివిన్ పార్టనర్ సుమిత్ర కారణం అని ఆరోపించడంతో కేసు మరో మలుపు తిరిగింది.

రోజువారీ కూలీ అయిన సురేష్ తన భార్య ఫోన్‌లో ఆమె, సుమిత్ర కలిసి ఉన్న కొన్ని అసభ్యకర ఫోటోలను, అలాగే వాయిస్ మెయిల్స్‌ను వినగా.. అది తనను అనుమానపడేలా చేసిందని పోలీసులకు తెలిపాడు. అలాగే భారతి తన బిడ్డను చంపినట్లుగా ఒప్పుకున్నా ఆడియో రికార్డింగ్ సైతం పోలీసులకు సమర్పించాడు. భారతి, సుమిత్ర దాదాపు మూడు సంవత్సరాలుగా రిలేషన్‌లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ముందు నుంచి రిలేషన్‌లో ఉన్న వీరిద్దరూ.. భారతికి కొడుకు పుట్టాక కలవడం తగ్గించారు. అలాగే ఈ జంట కలిసి సమయం గడిపేందుకు వీలు లేకపోవడంతో భారతి కొడుకును హత్య చేసిందని అధికారులు అనుమానిస్తున్నారు.

ఆ కోణంలోనే కేసును దర్యాప్తు చేస్తున్నారు. భారతి, సుమిత్రలను అరెస్ట్ చేసిన పోలీసులు.. సురేష్ అందించిన ఆధారాలను ధృవీకరించేందుకు ఫోరెన్సి,క్ కాల్ రికార్డ్ స్పెషలిస్టుల సాయం తీసుకున్నారు. కాగా, ఈ దంపతులకు నాలుగు, ఐదు సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమార్తెలు కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. శిశువు మృతదేహాన్ని డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్‌కు పంపించారు.