కొబ్బరి చట్నీ ఇడ్లీ, దోసలకు బెస్ట్ కాంబినేషన్. అంతేకాదు అనేక రకాల చట్నీలను తయారు చేసుకుంటారు. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో నిల్వ పచ్చళ్ళు, రోటీ పచ్చళ్లు అంటూ రకరకాల చట్నీలను చేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఉదయం టిఫిన్ మాత్రమే కాదు మధ్యాహ్నం, రాత్రి తినే భోజనంలో కూడా రోటీ పచ్చడి ఉండాల్సిందే. కొబ్బరి, వేరు శనగలు, టమాటాలు వంటి రకరకాల వంటి చట్నీలను రుచికరంగా తయారు చేస్తారు. అయితే ఎప్పుడైనా ఎండు కప్ప చట్నీని ట్రై చేశారా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వ్యక్తి కాస్త డిఫరెంట్ గా చట్నీని ప్రయత్నిస్తున్నాడు. ఈ డ్రై ఫ్రాగ్ రెసిపీ ని సిద్ధం చేస్తుండడం చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఈ డ్రై ఫ్రాగ్ అంటే ఎండబెట్టిన కప్పలతో తయారు చేసే ఈ చట్నీ మణిపూర్ సంప్రదాయ వంటకం. ఈ సాంప్రదాయ చట్నీని ఎండబెట్టిన కప్ప, ఎర్ర మిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, పుదీనా పొడి వేసి చేసి తయారుచేస్తారు. ఎండు చేపల చట్నీ లాగా ఈ ఎండు కప్పల చట్నీని కూడా అన్నంతో ఆస్వాదిస్తారు మణిపూర్ వాసులు. ఈ రెసిపీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వారం రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు 11.8 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకోగా.. రకరకాల కామెంట్లు వచ్చాయి. ఒకరు.. ఇతరులు తినే ఆహారాన్ని ఎవరూ ద్వేషించకూడదు, మీకు నచ్చిన ఆహారాన్ని తినే హక్కు మీకు ఉన్నట్లే, వారికి నచ్చిన ఆహారాన్ని తినే హక్కు వారికి ఉంది అని అన్నారు. మరోకరు “కప్ప తినడం సురక్షితమేనా?” అంటూ కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..