Viral Video: నడిరోడ్డు పై పాము ముంగిస ఫైట్.. గంటకు పైగా హోరాహోరీగా యుద్ధం.. నిలిచిపోయిన ట్రాఫిక్..

|

Sep 08, 2022 | 3:04 PM

తాజాగా సోషల్ మీడియాలో పాము , ముంగిస పైట్ వీడియో ఒకటి చక్కర్లు కొడుతుంది. ఒక నిమిషం రెండు నిమిషాలు కాదు సుమారు గంట పాటు వాటి మధ్య ఫైట్ జరిగింది. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

Viral Video: నడిరోడ్డు పై పాము ముంగిస ఫైట్.. గంటకు పైగా హోరాహోరీగా యుద్ధం.. నిలిచిపోయిన ట్రాఫిక్..
Viral
Follow us on

సాధారణంగా పాములు.. ముంగిస బద్ద శత్రువులు అన్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఇవి రెండు ఎదురుపడితే చాలు హోరాహోరీగా ఫైట్ జరుగుతుంది. ఇక తీవ్రస్థాయిలో ఈ రెండింటి మధ్య జరిగే పోరులో ఏది గెలుస్తుందనేది చెప్పడం చాలా కష్టం. బుసలు కొడుతూ పడగ విప్పి నాగుపాము పైపైకీ వస్తుంటే.. ఏమాత్రం భయపడిపోకుండా పాము మట్టికరిపిస్తుంది ముంగిస. ఈ రెండింటిని కోట్లాట చూసేందుకు ఎప్పుడూ ఆశ్చర్యమే. ఇప్పటికే పాము, ముంగిస పోరు వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో పాము , ముంగిస పైట్ వీడియో ఒకటి చక్కర్లు కొడుతుంది. ఒక నిమిషం రెండు నిమిషాలు కాదు సుమారు గంట పాటు వాటి మధ్య ఫైట్ జరిగింది. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

పాము ముంగిస హోరాహోరీగా పోరాడాయి.. ఒక నిమిషం రెండు నిమిషాలు కాదు సుమారు గంట పాటు వాటి మధ్య ఫైట్ జరిగింది.. నడిరోడ్డు పై జరుగుతున్న వాటి పోరు చూసి భయంతో వాహనదారులు నిలిచిపోయారు.. కొద్దిసేపటి తరువాత వీటి మధ్య పోరు చూస్తున్న ప్రయాణికులకు ఆసక్తిగా మారింది.. రెండింటి మధ్య ఉన్న జాతి పోరు గుర్తుచేసుకొని మరికొంతమంది మరింత ఆసక్తిగా చూశారు.. ఎట్టకేలకు చివరకి ముంగిస ధాటికి పాము ఓటమి పాలవ్వటంతో ముంగిస పామును నోట కరుచుకుని ప్రక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లటంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు… తెర్లాం రోడ్డులోని నెమలాం వద్ద జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఆసక్తిగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.