Viral Video:ఇండియాలో రష్యా యువతి.. లోకల్ ట్రైన్ లో ప్రయాణం.. వైరల్ వీడియో

భారత దేశానికి పర్యటనకు వచ్చే విదేశీయులు కూడా దేశంలోని మెట్రో, లోకల్‌ రైళ్లలో ప్రయాణించడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతే కాకుండా సంప్రదాయ పద్దతిలో కనిపించడానికి ట్రై చేస్తారు. లేటెస్ట్‌గా ఓ రష్యన్ యువతి ఇండియాకు వచ్చింది. మోడ్రన్ లుక్‌లో కాకుండా.. ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి ఆకట్టుకుంది. ముఖానికి బొట్టు పెట్టుకుని.. పసుపు రంగులో ఉండే కుర్తా ధరించి ఆకర్షించింది. ముంబైకి వచ్చిన రష్యన్ యువతి..

Viral Video:ఇండియాలో రష్యా యువతి.. లోకల్ ట్రైన్ లో ప్రయాణం.. వైరల్ వీడియో
Viral Video
Follow us

|

Updated on: Aug 19, 2024 | 6:39 PM

భారత దేశానికి పర్యటనకు వచ్చే విదేశీయులు కూడా దేశంలోని మెట్రో, లోకల్‌ రైళ్లలో ప్రయాణించడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతే కాకుండా సంప్రదాయ పద్దతిలో కనిపించడానికి ట్రై చేస్తారు. లేటెస్ట్‌గా ఓ రష్యన్ యువతి ఇండియాకు వచ్చింది. మోడ్రన్ లుక్‌లో కాకుండా.. ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి ఆకట్టుకుంది. ముఖానికి బొట్టు పెట్టుకుని.. పసుపు రంగులో ఉండే కుర్తా ధరించి ఆకర్షించింది. ముంబైకి వచ్చిన రష్యన్ యువతి.. అక్కడ లోకల్ ట్రైన్‌లో పర్యటించడానికి ఇంట్రెస్ట్ చూపించింది. టికెట్ కూడా తీసుకుంది.

ఈ మేరకు రెండు వీడియోలను ఈమె పోస్ట్ చేసింది. మొదటి వీడియోలో 5 రూపాయల టికెట్.. దాద్రికి తీసుకుంది. టికెట్ తీసుకుని ప్లాట్‌ ఫారమ్‌కు చేరుకుంది. రష్యాతో పోల్చితే రైల్వే టికెట్ ఎంతో చీప్ అని, ఇక్కడ పర్యటించడం ఎంతో హ్యాపీ అని చెప్పింది. ఆ తర్వాత టికెట్ తీసుకుని ట్రైన్ కోసం వెయిట్ చేసింది. ఇంతలో లోకల్ ట్రైన్ వచ్చింది. ట్రైన్ చాలా ఫుల్ ఉంది.. ఆ తర్వాత ట్రైన్‌లో లేడీస్ కోసం స్పెషల్ కోచ్ ఉందని చెప్పింది. అక్కడ ట్రైన్‌లో ఉన్న వ్యక్తులతో పరిచయం పెంచుతుంది. ఆ తర్వాత స్టేషన్ రాగానే.. దిగింది. ఐదు రూపాయల టికెట్ అనేది చాలా చీప్ అని చెప్పింది.

ఈ వీడియోపై నెటిజన్లు ఎంతో కామెంట్ల వర్షం కురిపించారు. ‘సో స్వీట్’.. ‘వావ్ ఇండియన్ ట్రెడిషన్‌లో ఎంత అందంగా ఉందో’.. ‘లోకల్ ట్రైన్‌లో రష్యన్ గర్ల్.. సూపర్’.. ‘ఎంత పద్దతిగా చెబుతుంది’.. ‘మహా లక్ష్మిలా ఉంది’.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రెండు వీడియోలకు కలిపి ఇప్పటి వరకూ 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోస్ మీరు కూడా చూడండి.