Viral Video: సీబీఐ రైడింగ్ అనుకుంటే పొరపాటే.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్!

వింతలూ.. విశేషాలూ.. వైరల్ వీడియోలు.. సోషల్ మీడియాలో లెక్కలేనన్ని రోజూ నెటిజన్లను పలకరిస్తుంటాయి. ఈ కోవలోనే ఓ వీడియో..

Viral Video: సీబీఐ రైడింగ్ అనుకుంటే పొరపాటే.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్!
Robbery

Updated on: Apr 01, 2022 | 8:51 AM

వింతలూ.. విశేషాలూ.. వైరల్ వీడియోలు.. సోషల్ మీడియాలో లెక్కలేనన్ని రోజూ నెటిజన్లను పలకరిస్తుంటాయి. ఈ కోవలోనే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు మేము చూపించబోయే వైరల్ వీడియో పాతదే అయినప్పటికీ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు అందులో ఏం జరిగిందో మీరే చూసి చెప్పాలి. ఓకేనా.. ముందుగా వీడియో చూసేయండి మరి..

చూశారా.? అసలక్కడ ఏం జరిగిందంటారు.! ఏదో సినిమా షూటింగో.. లేదా సీబీఐ రైడింగో.. లేదా ఫటాఫట్‌ దుకాణం సర్దేస్తున్నారని అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. అక్కడి జరిగింది దొంగతనం.. ఎస్.. పట్టపగలు.. మిట్ట మధ్యాహ్నం.. ముంబైలోని ములుంద్ ఏరియాలో ఓ ఆఫీస్‌ను దోచుకున్నారు దొంగలు.

నలుగురు దొంగలు.. నాలుగు మాస్కులు.. నాలుగు గన్లు.. వచ్చారు.. తిట్టారు.. గురి పెట్టారు.. మొత్తం దోచేశారు. దాదాపుగా కోటి రూపాయలు పట్టుకుని వెళ్లిపోయారు. ఇదేంటి.. దొంగతనం ఇంత ఈజీనా అనుకోవచ్చు. అప్పుడెప్పుడో కవిత్వం రాయడం చాలా ఈజీ అన్నాడు.. శ్రీశ్రీ.. ఇప్పుడు దొంగతనం చేయడం చాలా ఈజీ అంటున్నారు వీళ్లు.. అయితే ముంబై పోలీసులు ఏమైనా తక్కువ తిన్నారా.. పట్టుకుని.. పనిష్మెంట్ ఇవ్వడం కూడా ఇంకా ఈజీ అని.. ఆ కేటుగాళ్ల అంతు చూశారు.

Also Read: Viral Photo: ఈ ఫోటోలో పామును కనిపెడితే మీరే జీనియస్.. ఈజీగా కనిపెట్టొచ్చండోయ్.!

Loading...
Unable to load recommendations.
Follow Us