AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold River: నీటితోపాటు బంగారం ప్రవహించే నది.. అక్కడికి వెళ్తే ధనవంతులు అవ్వడం పక్కా..! ఎక్కడంటే..

ఈ నది మరే ఇతర నదిలో కలవకుండా నేరుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు 474 కిలోమిటర్ల దూరం ప్రయాణించి ఒరిస్సా దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. వందేళ్ల తర్వాత కూడా ఈ నదిలో బంగారం ఎందుకు ప్రవహిస్తుందో శాస్త్రవేత్తలు కూడా గుర్తించలేకపోయారు. ఈ నదిలోని బంగారం ఎక్కడి నుండి వస్తుందనేది నేటికి అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిందని చెబుతున్నారు.

Gold River: నీటితోపాటు బంగారం ప్రవహించే నది.. అక్కడికి వెళ్తే ధనవంతులు అవ్వడం పక్కా..! ఎక్కడంటే..
Gold River
Jyothi Gadda
|

Updated on: Sep 16, 2025 | 7:02 AM

Share

భారత దేశం నదులకు పుట్టినిల్లుగా పిలుస్తారు..అంతేకాదు.. నదిని మన దేశంలో నదీమ తల్లిగా పూజిస్తారు. దేశవ్యాప్తంగా నదులు, వాటి ఉపనదులతో కలిపి 400కు పైగా ప్రవహిస్తున్నాయి. ఇకపోతే, ఒక్కో నదికి ఒక్కో ప్రత్యేకతతో పాటు ఓ చరిత్ర కూడా ఉంది. అటువంటి ముఖ్యమైన నదులలో స్వర్ణరేఖ నది ఒకటి. దీనినే గోల్డెన్‌ రివర్‌ అని కూడా అంటారు. ఈ నదిలో నీళ్లతో పాటు బంగారం కూడా ప్రవహిస్తుందని మీకు తెలుసా..? అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. భారతదేశంలోని ఈ నదిలో కోట్ల విలువైన బంగారు నిక్షేపాలు ఉన్నాయి. నీటిలో బంగారం ప్రవహిస్తుంది. రోజూ అక్కడి ప్రజలు బంగారం కోసం నీటిని జల్లెడ పడుతుంటారు.

స్వర్ణరేఖ నది లేదా గోల్డెన్‌ రివర్‌..ఇది జార్ఖండ్ రాజధాని రాంచీకి సమీపంలో పుట్టి, జార్ఖండ్‌లో ప్రవహిస్తుంది. ఇక్కడ నివసించే స్థానిక ప్రజలకు ఈ నది ముఖ్యమైన ఆదాయ వనరు. ఎందుకంటే.. ఇక్కడి ప్రజలు ప్రతిరోజూ నది ఒడ్డుకు వెళ్లి నీటిని ఫిల్టర్ చేసి బంగారం సేకరిస్తుంటారు.. స్వర్ణ రేఖ నది మూలం జార్ఖండ్ రాజధాని రాంచీ నుండి 16 కి.మీ. దూరంగా ఉంది. ఈ నది జార్ఖండ్‌లో పుట్టి పశ్చిమ బెంగాల్, ఒడిశా మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది.

ఈ నదికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే జార్ఖండ్ నుండి ప్రవహించిన ఈ నది మరే ఇతర నదిలో కలవకుండా నేరుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు 474 కిలోమిటర్ల దూరం ప్రయాణించి ఒరిస్సా దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. వందేళ్ల తర్వాత కూడా ఈ నదిలో బంగారం ఎందుకు ప్రవహిస్తుందో శాస్త్రవేత్తలు కూడా గుర్తించలేకపోయారు. ఈ నదిలోని బంగారం ఎక్కడి నుండి వస్తుందనేది నేటికి అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్