Viral News: ఎల్‌నీనో టైంలో మాత్రమే కనిపించే ఇలాంటి పామును మీరెప్పుడైనా చూశారా..

అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి పాము ఆకారంలో ఉన్న ఓ అరుదైన సముద్ర జీవి కొట్టుకొచ్చింది.చూడ్డానికి పాములా కనిపిస్తూ నలుపు, పసుపు రంగులతో వింతగా కనిపించే ఈ జీవులు ఎక్కవగా ఉష్ణమండల ప్రాంతాల్లో నివసిస్తాయని.. ఇవి కేవలం ఎల్‌నీనో పరిస్థితుల సమయాల్లోనే ఇలా కొట్టుకొస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Viral News: ఎల్‌నీనో టైంలో మాత్రమే కనిపించే ఇలాంటి పామును మీరెప్పుడైనా చూశారా..
Yellow Bellied Sea Snake

Updated on: Nov 29, 2026 | 1:15 PM

అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో అరుదైన విషపూరిత సముద్ర జీవి కనిపించింది. నవంబర్ 22 ఆదివారం సాయంత్రం కాలిఫోర్నియా తీరానికి కొట్టుకొచ్చిన ఈ విచిత్ర జీవిని స్టేట్ పార్క్స్ సిబ్బంది గుర్తించగా.. నవంబర్ 25న దీనికి సంబంధించిన ఫోటోలు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. అయితే ఇలాంటి పాములు సమద్రతీరానికి కొట్టుకురావడం చాలా అరుదని.. ఇప్పటి వరకు కేవలం 8 మాత్రమే ఇలాంటి పసుపు పొట్ట ఉన్న పాములు కనిపించాయని అధికారులు చెబుతున్నారు. అయితే వాటిలో ఒక్కటి మినహా విగతావన్ని ఎల్‌నీనో సమయాల్లోనే తీరానికి కొట్టుకొచ్చాయని తెలిపారు.

ఈ ఘటనపై శాన్ డియాగో నేచురల్ హిస్టరీ మ్యూజియంలో హెర్పెటాలజీ కలెక్షన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆడమ్ క్లాజ్ మాట్లాడుతూ.. ఈ పాములు ఎక్కవగా ఉష్ణమండల ప్రాంతాల్లోని వెచ్చని నీటిలో నివసించే జాతికి చెందినదని తెలిపారు. ఇది సముద్రంలో బహిరంగ జలాల్లో జీవిస్తుందని, దక్షిణ కాలిఫోర్నియా తీరంలో ఇవి కనిపించడం చాలా అసాధారణమన్నారు.

ఎల్‌నినో సమయంలోనే ఎందుకు కనిపిస్తున్నాయి?

అయితే ఎల్‌నినో సమయంలోనే ఇవి కనిపించడానికి గల కారణాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. సాధారణంగా ఎల్‌నీనో సమయంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగడం వల్ల దక్షిణ కాలిఫోర్నియా తీరంలోని సముద్ర జలాలు వెడెక్కుతాయి, దానికి తోడు ఉష్ణమండల ప్రాంతాల్లో ఉండే సముద్ర జీవులు ఉత్తర దిశగా ప్రయాణిస్తాయి. ఈ క్రమంలోనే పసుపు పొట్ట సముద్ర పాములు కూడా కాలిఫోర్నియా తీరానికి కొట్టుకొచ్చి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

దీనిపై లాస్ ఏంజెలెస్ కౌంటీ నేచురల్ హిస్టరీ మ్యూజియంకు చెందిన గ్రెగ్ పౌలీ మాట్లాడుతూ..కాలిఫోర్నియాలో 1972-73 ఎల్‌నినో సమయంలో తొలిసారిగా ఇలాంటి జీవులు సముద్ర తీరానికి కొట్టుకొచ్చాయని తెలిపారు. అలాగే
అలాగే 2015-16లో సంభవించిన తీవ్ర ఎల్‌నినో సమయంలో మరో మూడు పాములు తీరానికి కొట్టుకొచ్చాయని వివరించారు.2018లోనూ ఇలాంటి జీవును తీరానికి కొట్టుకొచ్చినట్టు చెప్పుకొచ్చారు.

కనిపిస్తే ఏం చేయాలి?

బీచ్‌లలో ఇలాంటి వింత సముద్ర జీవులు కనిపించినప్పుడు ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని పార్క్ అధికారులు సూచిస్తున్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్ర జీవులను చేతులతో తాకకూడదని..అవి చనిపోయినట్లు కనిపించినా వాటికి దూరంగా ఉండాలని.. వీలైతే అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.

పోస్ట్ చూడండి..


మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us